30 ఏళ్ల నిరీక్షణ తర్వాత...రూ.390 కోట్ల లాటరీ!

posted on: May 7, 2026 3:32PM

 

లేట్ అయినా.. పెద్ద జాక్‌పాట్ కొట్టారు...

యూఎస్ దంపతులకు రూ.390 కోట్ల లాటరీ..

అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు. చివరికి 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ దంపతులను భారీ అదృష్టం వరించింది. ఏకంగా రూ.390 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగు చూసింది. టెక్సాస్‌లోని రిచర్డ్‌సన్‌కు చెందిన దంపతులు గత 30 ఏళ్లుగా లాటరీలు కొంటున్నారు. ఏనాటికైనా తమను అదృష్టం వరిస్తుందన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. వారి నమ్మకమే నిజమైంది. 

దంపతులు ఏప్రిల్ నెలలో మెస్క్వైట్‌లోని సెవెన్ ఎలెవెన్ స్టోర్ నుంచి క్విక్ పిక్ లాటరీ టికెట్ కొన్నారు. ఆ టికెట్ వారి జీవితాన్ని మారుస్తుందని దంపతులు అస్సలు ఊహించలేదు. ఏప్రిల్ 20వ తేదీన తీసిన డ్రాలో వారు కొన్న టికెట్‌కు ప్రైజ్ మనీ వచ్చింది. ఏకంగా 41 మిలియన్ డాలర్స్ .. ఇండియన్ కరెన్సీలో రూ.390 కోట్ల రూపాయలు  వారి సొంతం అయ్యాయి. అయితే, పేర్లు బయటకు చెప్పడానికి ఆ దంపతులు ఇష్టపడలేదు. తాము ఏ రోజైనా అదృష్టం వరించకపోతుందా అన్న నమ్మకంతో ఉన్నామని, 30 ఏళ్ల తర్వాత అదృష్టం వరించిందని ఆ దంపతులు పేర్నొన్నారు. వచ్చిన డబ్బులలో కొంత కుటుంబసభ్యులకు పంచుతామని చెప్పారు. మరికొంత డబ్బుతో ప్రపంచ పర్యటన చేస్తామని అనందంగా వెల్లడించారు.
 

 

google-ad-img
    Related Sigment News
    • Loading...