ఇరాన్ పై అమెరికా వైమానిక దాడి.. ఇండియా రావాల్సిన విమానం ధ్వంసం

posted on: Mar 31, 2026 9:15AM

ఇరాన్ పై అమెరికా దాడిలో భారత విమానం ధ్వంసమైంది. ఈ ఘటన ఇరాన్ లోని మషద్ విమానాశ్రయంలో సోమవారం (మార్చి 30) జరిగింది. ఈ విమానం భారత్ నుంచి మానవతా సాయంగా అందాల్సిన వైద్య సామగ్రిని తీసుకువెళ్లే విమానం కావడం గమనార్హం.  ఇరాన్ పై అమెరికా  వైమానిక దాడిలో  మహాన్ ఎయిర్  సంస్థకు చెందిన ఈ విమానం ధ్వంసమైంది.  ఈ విమానం వచ్చే నెల 1న ఇండియాకు చేరుకుని ఇక్కడ నుంచి ఇరాన్ ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్య సమగ్రి, ఇతర ఔషధాలను రవాణా చేయాల్సి ఉంది.  

అయితే మషద్ విమానాశ్రయంపై  జరిగిన ఈ దాడిలో విమానం దెబ్బతినడంతో భారత్ నుంచి సహాయంపై  నీలినీడలు కమ్ముకున్నాయి.  ఈ దాడితో తమ మిషన్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని ఇరాన్ ప్రకటించింది.  ఇప్పటికే మార్చి 18న తొలి విడత వైద్య సహాయాన్ని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ద్వారా భారత్ ఇరాన్‌కు పంపింది.

ఈ సహాయం పట్ల న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు  తెలిపింది. మహాన్ ఎయిర్ అనేది పశ్చిమాసియా, మధ్య ఆసియా, దక్షిణాసియాలో సేవలు అందిస్తున్న ఒక ప్రైవేట్ విమానయాన సంస్థ. అదలా ఉండగా ఈ వైమానిక దాడిని అమెరికా ధ్రువీకరించలేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...