ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..ఆరుగురు ఫైనలియర్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు

posted on: Jun 17, 2026 2:42PM

హైదరాబాద్  లో  ర్యాగింగ్ మరోసారి కలకలం రేపింది.  . విద్యాబుద్ధులు నేర్చుకుని సమాజానికి సేవ చేయాల్సిన కాబోయే వైద్యులే తోటి విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు.  హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ డెంటల్ కాలేజీలో జూనియర్లపై ర్యాగింగ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా  సంచలనంగా మారింది.  క్రమశిక్షణకు, ఉన్నత విలువులకు మారుపేరుగా నిలవాల్సిన వైద్య విద్యా సంస్థలో ర్యాగింగ్ పట్ల  సర్వత్రా ఆందోళనకు దారితీస్తోంది.

ర్యాగింగ్ సంఘటనకు సంబంధించి  ప్రభుత్వ డెంటల్ కాలేజీకి చెందిన 12 మంది ఫైనల్ ఇయర్ సీనియర్ విద్యార్థులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బాధితులు,  ప్రస్తుతం మొదటి సంవత్సరం  బీడీఎస్  చదువుతున్నారు. ప్రభుత్వ డెంటల్ కాలేజీ విద్యార్థులు నివసిస్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలోనే ఈ  ర్యాగింగ్ జరిగింది. హాస్టల్ గదుల్లో ఒంటరిగా దొరికిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు  ర్యాగింగ్ పేరుతో శారీరకంగా, మానసికంగా వేధించినట్లు చెబుతున్నారు. 

ఫ్రెషర్స్ డే సన్నాహాల  పేరుతో మొదలైన ఈ వేధింపులు..  ఆ తర్వాత శ్రుతిమించి  హింసాత్మక రూపం దాల్చాయి. కాలేజీ హాస్టల్ పరిసరాల్లో రాత్రి సమయాల్లో జూనియర్లను నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిసింది. దీనిపై బాధితులు ఇచ్చిన సమాచారంతో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్  సుల్తాన్ బజార్ పోలీసులకు రాతపూర్వకంగా  ఫిర్యాదు చేశారు.

ప్రిన్సిపల్  ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సుల్తాన్ బజార్ పోలీసులు  వేధింపులకు పాల్పడిన ఆ 12 మంది ఫైనల్ ఇయర్ సీనియర్ విద్యార్థులపై  తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్  కింద నాన్-బైలబుల్ సెక్షన్లతో కేసులను నమోదు చేసి దర్యాప్తు  వేగవంతం చేశారు. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది విద్యార్థుల ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు  విచారణ జరుపుతున్నారు.  

కేసు నమోదు కాగానే కాలేజీ యాజమాన్యం కూడా అంతర్గత క్రమశిక్షణా చర్యలను ముమ్మరం చేసింది. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా, ఆ 12 మంది నిందితులలో   చురుగ్గా వ్యవహరించిన ఆరుగురు ఫైనల్ ఇయర్ విద్యార్థులను తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆరు నెలల పాటు  సస్పెండ్ చేస్తూ చేసింది. మిగిలిన ఆరుగురిపై కూడా పూర్తిస్థాయి విచారణ పెండింగ్‌లో ఉందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో సదరు సీనియర్ విద్యార్థుల విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...