యూపీలో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి.!

posted on: Aug 6, 2026 9:55AM

గాఢ నిద్రలో ఉన్న ఆ కుటుంబం శాశ్వత నిద్రలోకి జారుకుంది.  కుండపోతగా కురుస్తున్న వర్షానికి వారు నివసిస్తున్న ఇల్లు కుప్పకూలి కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా  మౌజమ్‌పూర్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం (ఆగస్టు 6) తెల్లవారుజామున ఈ ఘోర సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో  గత కొన్ని రోజులుగా   ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు  రహీస్ అనే వ్యక్తికి చెందిన రెండంతస్తుల ఇల్లు  కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు  ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఇంటి యజమాని రహీస్, ఆయన భార్య, వారి పిల్లలు  మరణించారు.  

 యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, బాధిత కుటుంబానికి తక్షణమే   4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే, జిల్లా యంత్రాంగం నిరుపేద కుటుంబాలకు, పాత ఇళ్లలో నివసిస్తున్న వారికి వర్ష కాలంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

UP rains accident, Moradabad house collapse, UP heavy rains tragedy, 6 dead in Moradabad, Uttar Pradesh news, UP house collapse

google-ad-img
    Related Sigment News
    • Loading...