కష్టాల్లో.. చిరంజీవి చూపిన దారిలో స్మృతి..!

posted on: Aug 1, 2016 6:02PM

ఎవరి వద్దనుంచయినా సాయం పొందితే మీరు ప్రతిఫలం ఆశించకుండా మరో ముగ్గురికి సాయం చేయండి. వారిని కూడా అలాగే సాయం చేయమని చెప్పండి, వారు ముగ్గురికి సాయం చేస్తారు. అలా ప్రపంచం మొత్తం సాయం చేసేవారితో నిండిపోయి..ప్రజలు సమస్యలు లేకుండా జీవిస్తారు. ఈ డైలాగ్ ఎప్పుడో ఎక్కడో విన్నట్లుగా ఉంది కదూ..? అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలోనిది ఆ డైలాగ్. ఈ డైలాగ్ అప్పట్లో ఎంతో ఫేమస్..చాలా మంది నోట ఈ మాట వినిపించి, ఎందరి మనసులనో మార్చి సాయం చేసే దిశగా నడిపించిన డైలాగ్ అది. ఇప్పుడు ఆ డైలాగ్‌ను స్పూర్తిగా తీసుకున్నారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. ఫ్యాషన్ పేరు చెప్పో..మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనో నేటి తరం దేశీయ చేనేత రంగం నుంచి వచ్చిన దుస్తులను కాకుండా కార్పోరేట్ కంపెనీలు తయారు చేసిన రంగు రంగుల దుస్తుల వెంట పడుతోంది. దీంతో దేశవాళీ చేనేత రంగం కుదేలై..నేతన్న తినడానికి తిండి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు.

 

అయితే కొత్తగా కేంద్ర జౌళీ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్మృతీ ఇరానీ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించి వినూత్నంగా ముందడుగు వేశారు. దానిలో భాగంగా బీహార్ నుంచి తెప్పించిన చేనేత సిల్క్ చీరను ధరించిన ఆమె ఆ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాకుండా "ఐవేర్ హ్యాండ్లూమ్" యాష్‌ట్యాగ్‌తో సరికొత్త ఆన్‌లైన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. "ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించి..ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలని, ఐవేర్ హ్యాండ్లూమ్ యాష్‌ట్యాగ్‌తో ఆ పోస్టుకు మరో ఐదుగురిని ట్యాగ్ చేయాలని, ఆ ఐదుగురు కూడా" ఇలా చేయడం ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలవాలని కోరారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...