అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. విమానంలో క్యాబిన్ లగేజీగా ఇరుముడి
posted on Nov 29, 2025 5:52AM
.webp)
శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు శబరిమలకు విమాన ప్రయాణంలో తమతో పాటు తమ ఇరుముడిని కూడా క్యాబిన్ లగేజీగా తీసుకువెళ్లడానికి అనుమతి ఇచ్చారు. భక్తుల మనోభావాలను, ఆచారాలను గౌరవిస్తూ పౌరవిమానయాన శాఖ ఈ వెసులుబాటు కల్పిస్తున్నదని ఆయన తెలిపారు. శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిన ఈ ప్రత్యేక వెసులు బాటు జనవరి 20 వరకూ అమలులో ఉంటుందని రామ్మోహననాయుడు తెలిపారు.
ఇప్పటి వరకూ అయ్యప్ప స్వాములు విమానంలో తమతో పాటు క్యాబిన్ లగేజీగా తమ ఇరుముడిని తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. అయితే తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయ్యప్ప భక్తులకు అందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. య్యప్ప స్వాములు శబరిమల దర్శనానికి వెళ్లే సమయంలో తమ ఇరుముడిని తమతో పాటు విమానంలోనే తీసుకెళ్లడం పట్ల ఉన్న భక్తి భావాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించి ఈ ప్రత్యేక సడలింపు ఇచ్చిందని పేర్కొన్నారు.