Latest News

పెమ్మ‌సానిపై...అంబ‌టి టార్గెట్...వెన‌క ఇంత మేట‌ర్ దాగుందా?

posted on: Mar 27, 2026 3:53PM

 

ఇటీవ‌ల జ‌గ‌న్ ఒక  కీల‌క‌మైన కామెంట్ చేశారు. చంద్ర‌బాబు మొహం చూసి రాష్ట్రానికి  పెట్టుబ‌డులు ఎలా వ‌స్తాయంటూ.. బాడీ షేమింగ్ సైతం చేశారు. ఈ విష‌యంపై.. కేంద్ర‌మంత్రి పెమ్మ‌సాని తీవ్రంగా  రియాక్ట‌య్యారు. మీలా బాడీషేమింగ్ కామెంట్లు చేయ‌డం త‌మకూ తెలుస‌న్నారు పెమ్మ‌సాని. అయితే ఇందుకు త‌మ‌కు సంస్కారం అడ్డు వ‌స్తోంద‌ని చెప్పారు. ఒక్క మాట‌తో తాము కూడా చంపేయ‌గ‌ల‌మ‌ని పెమ్మ‌సాని అన‌డంతో.. ఆ మాట అడ్డు పెట్టుకున్న అంబ‌టి.. పెమ్మ‌సానిపై ఒక ట్వీట్ చేశారు. మాట‌తోనే చంపేంత రౌడీవా? పెమ్మ‌సానీ! అంటూ..

బేసిగ్గా రాంబాబుకు పెమ్మ‌సాని సాటి ప్ర‌త్య‌ర్ధి ఏమీ  కాదు. పెమ్మ‌సాని  ఎంపీ, అంబ‌టి ఎమ్మెల్యే కంటెస్టెంట్. అంబ‌టి హిస్ట‌రీ ఒక  సారి తిర‌గేస్తే.. 1989లో కాంగ్రెస్ నుంచి  రేప‌ల్లె నుంచి పోటీ చేసిన అంబ‌టి తొలిసారి ఎమ్మెల్యేగా  గెలిచారు. ఆ త‌ర్వాత అంటే 2019లో వైసీపీ హ‌వాలో మ‌రోమారు స‌త్తెన‌ప‌ల్లి  నుంచి గెలిచారు. అంటే ముప్పై ఏళ్ల త‌ర్వాత తిరిగి ఎమ్మెల్యే అయ్యారు అంబ‌టి. వ‌రుస‌గా  రేప‌ల్లె నుంచి ఓడి.. ఆ త‌ర్వాత 2004, 2009 ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేయ‌ని అంబ‌టి కాంగ్రెస్‌లో  ఉండ‌గా ద‌క్కిన ప‌ద‌వి ఒకే ఒక్క‌ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పోస్టు. ఆ త‌ర్వాత వైసీపీ గెలిచిన‌పుడు గెల‌వ‌డంతో ఆయ‌న‌పై ఎన్ని లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చినా కూడా జ‌గ‌న్ మంత్రిప‌ద‌వి ఇచ్చి గౌర‌వించారు.

ఇదిలా ఉంటే పెమ్మ‌సాని ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో ప‌రిశీలిస్తే.. ఉస్మానియాలో వైద్య విద్య అభ్య‌సించి.. యూఎస్ వెళ్లారు. అక్క‌డ ఎంతో క్లీన్ గా ఒక కంపెనీ పెట్టి.. కోట్లాది రూపాయ‌ల డ‌బ్బు సంపాదించారు.. తాను పుట్టిన ఆంధ్ర‌గ‌డ్డ‌పై మ‌మ‌కారం చావ‌క‌.. తిరిగి ఏపీ వ‌చ్చారు. 2019లోనే  న‌ర‌స‌రావుపేట ఎంపీగా  పోటీ చేడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఈలోగా ఇక్క‌డి నుంచి  రాయ‌పాటిని రంగంలోకి దించింది టీడీపీ అధిష్టానం. దీంతో సైలంట్ గా ఉన్న పెమ్మ‌సాని, 2024లో గుంటూరు ఎంపీగా టీడీపీ టికెట్ సాధించి.. ఎట్ట‌కేల‌కు ఎంపీగా గెల‌వ‌డం మాత్ర‌మే  కాక‌.. కేంద్ర మంత్రిగానూ ప్ర‌మోట్ అయ్యారు.

అయితే అంబ‌టి పెమ్మ‌సానిని ఇంత‌గా టార్గెట్ చేయ‌డం వెన‌క గ‌ల జ‌గ‌న్ ఎత్తుగ‌డ ఏంటంటే.. పెమ్మ‌సాని త‌మ‌లా కాకుండా ఎంతో క్లీన్ గా ఎదిగిన  ఒకానొక కోటీశ్వ‌రుడు. దేశంలోని  ఎంపీల్లోనే రిచెస్ట్. అదే జ‌గ‌న్ ఎన్నో సూట్ కేసు కంపెనీలు పెట్టి, ఆపై క్విడ్ ప్రోకో వంటి వాటికి పాల్ప‌డి.. దేశంలోనే అత్యంత సంప‌న్న ఎమ్మెల్యేగా ఎదిగారు. 

ఈ రెండు ఎదుగుద‌ల క్ర‌మాల‌ మ‌ధ్య పోలీక చూస్తే న‌క్క‌కీ- నాగ‌లోకానికీ ఉన్నంత తేడా  ఉంటుంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అంబ‌టిని కావాల‌ని గుంటూరు ప‌శ్చిమ ఇంచార్జ్ గా నియ‌మించారు. ఆపై శంక‌ర్ విలాస్ బ్రిడ్జ్ ద‌గ్గ‌ర  నుంచి ప్ర‌తిదానికీ పెమ్మ‌సానిపై ఫోక‌స్ పెట్టి వ‌రుస వివాదాల్లోకి లాగే య‌త్నం చేస్తున్నారు. 

దీనర్ధం ఏంటంటే.. ఇటు జ‌గ‌న్ ఆయ‌న మెచ్చిన  కాపు టైగ‌ర్ అంబ‌టి మాత్ర‌మే కాదు.. పెమ్మ‌సాని కూడా సేమ్ టు సేమ్ ఒకే ర‌క‌మైన వాళ్ల‌నే ముద్ర వేయించ‌డంలో భాగంగానే ఇదంతా జ‌రుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే తాను ఎంపీ  కేండేట్ కాక పోయినా స‌రే, అంబ‌టికి ఎలాంటి తాహ‌తు లేకున్నా  స‌రే పెమ్మెసానిపై టార్గెట్ చేయిస్తున్నారు జ‌గ‌న్. ఇందులో ఇంత స్ట్రాట‌జీ ఉంది  కాబ‌ట్టి... పెమ్మ‌సాని సైతం కాస్త కంట్రోల్లో ఉండాల‌ని సూచిస్తున్నారు గుంటూరు వాసులు, ఇత‌ర‌ కూట‌మి కార్య‌క‌ర్త‌లు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...