విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా
posted on: Feb 10, 2026 2:13PM

విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హస్తిన పర్యటన ఉండగా.. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ఈ విషయాన్ని చంద్రబాబుకు తెలియజేశారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ సీఎం నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం (ఫిబ్రవరి 9) హస్తిన చేరుకున్న చంద్రబాబు.. మంగళవారం (ఫిబ్రవరి 10) పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పెరుగుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల అవసరాలు, భవిష్యత్తు విస్తరణ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది.



.webp)


