Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి ఖాయం!
posted on: Jul 10, 2014 5:50PM

కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగానే దేశ ప్రజలకి, రాజకీయ వర్గాలకి, పారిశ్రామిక వర్గాలకి ఒక విషయం చాలా క్లారిటీగా అర్థమైపోయింది. ఆ విషయం మరేదో కాదు.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి ఖాయం! రాష్ట్రం ముక్కలు కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిపోయినప్పటికీ, ప్రగతిశీలి, మంచి విజన్ వున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల దేశానికి నమ్మకం కుదిరింది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ని వ్యవసాయం పరంగా మాత్రమే కాకుండా పారిశ్రామికంగా కూడా ముందుకు తీసుకువెళ్ళే విషయంలో కృతనిశ్చయుడిగా వుండటంతో దేశంలోని బడా పారిశ్రామిక సంస్థలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రామిక ప్రగతి బాగా జరుగుతుందన్న నమ్మకం ఇప్పుడు దేశ పారిశ్రామికవర్గాల్లో ఏర్పడింది. అందుకే అనేకమంది బడా పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో పారిశ్రామికంగా ఎంత ముందడుగు వేస్తుందో చెప్పకనే చెప్పాయి. కాకినాడలో హార్డ్ వేర్ పార్కు, కృష్ణపట్నం రేవు అభివృద్ధి, అక్కడే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు, ఇంకా విశాఖ పట్టణం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్... ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందడుగు వేయడానికి ఎంతో సహకరిస్తాయి.


.jpg)
.jpg)


