Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...7,437 కాదు.. 19 వేల పోస్టులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వాలి..!
posted on: Jul 30, 2026 9:16PM
.webp)
అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా..!
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మరోసారి తమ గళాన్ని వినిపిం చారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్, చిక్కడపల్లి లైబ్రరీల వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. భారీ వర్షం కురుస్తున్నప్ప టికీ లెక్కచేయకుండా ఆందోళనను కొనసాగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన 7,437 కానిస్టేబుల్ పోస్టులతో సరిపెట్టకుండా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి మొత్తం 19 వేల పోస్టులతో కొత్త కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్థులు కొంతకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటంతో అనేక మంది నిరుద్యోగు లకు అవకాశం దక్కే పరిస్థితి లేదని ఆందోళ నకారులు పేర్కొన్నారు.
పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ లెక్కలోకి తీసుకుని 19 వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ సిబ్బంది అవసరం ఉన్న నేపథ్యంలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితిని సడలిం చాలని నిరుద్యోగులు కోరారు. గత కొన్నేళ్లుగా నోటిఫికేషన్లు సకాలంలో విడుదల కాకపోవడంతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి దాటి పోయే పరిస్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా వయోపరిమితి సడలింపు ప్రకటించి, ఉద్యోగాల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
కేవలం పోలీస్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యో గులు స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. అలాగే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి, వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అశోక్‌నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లోని లైబ్రరీలు ఎంతోకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ప్రతిరోజూ వందలాది మంది అభ్యర్థులు ఇక్కడ చదువుకుంటూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహిం చారు. వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురైనా ఆందోళన నుంచి వెనక్కి తగ్గలేదు.
ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను సీరియస్‌గా తీసుకుని ఖాళీగా ఉన్న అన్ని పోస్టులపై సమగ్రంగా లెక్కలు సేకరించాలని వారు కోరారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. 7,437 కానిస్టేబుల్ పోస్టులతో కాకుండా 19 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ఎస్సై, కానిస్టేబుల్ వయోపరిమితి సడలింపు, మెగా డీఎస్సీ, గ్రూప్-1, 2, 3, 4 తదితర ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసే వరకు తమ ఆందోళ నలను కొనసాగిస్తామని నిరుద్యోగులు స్పష్టం చేశారు.
Unemployed people protest in Ashoknagar, Constable Notification, Ashoknagar, Chikkadapalli, CM Revanth reddy, TGPSC


.webp)
.webp)


