Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కుర్రాళ్లు కుమ్మేశారు...అండర్-19 విశ్వవిజేతగా భారత్
posted on: Feb 6, 2026 8:15PM

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా 100 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 412 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు 40.2 ఓవర్లలో 311 పరగులకు ఆలౌట్ అయింది. 177 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయినా..ఫాల్క్‌నర్ సెంచరీతో చేశాడు. డాక్సిన్స్ (66) మేయేస్ 45 పరుగులతో రాణించాడు. భారత్ బౌలర్లలో అంబరీశ్3, దేవేంద్ర, చౌహాన్ తలో 2 వికెట్లు తీశారు. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది.
సెమీఫైనల్ సెంచరీ హీరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ (9) కేవలం 20 రన్స్‌కే ఔటయ్యాడు. ఈ దశలో వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. సూర్యవంశీ తన తుపాను ఇన్నింగ్స్‌లో కేవలం 80 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు చేశాడు. మరోవైపు, కెప్టెన్ ఆయుష్ మాత్రే (51 బంతుల్లో 53) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 90 బంతుల్లోనే 142 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వేదాంత్ త్రివేదితో కలిసి మూడో వికెట్‌కు సూర్యవంశీ 89 రన్స్ చేశారు.. ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్‌కు చేరిన భారత్.. ఆరోసారి టైటిల్‌ను ముద్దాడింది.


.webp)



