Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చీరకట్టులో ఇద్దరు మహిళల స్నో బోర్డింగ్
posted on: Mar 6, 2026 6:24PM

చీరకట్టులో ఇద్దరు మహిళలు స్నో బోర్డింగ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. నేటి జమానాలో మహిళలు ఉద్యోగవ్యాపార రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకెళుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మహిళలు దుస్తులను ఎంచుకుంటున్నారు. పని ప్రదేశాల్లో తమకు అనుకూలంగా ఉండే వస్త్రధారణ వైపు మొగ్గు చూపుతున్నారు. చీరలు, ఇతర సంప్రదాయ వస్త్రాలను పండుగలు, లేదా ప్రత్యేక సందర్భాల్లోనే ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చీరలు ధరించిన ఇద్దరు మహిళలు ఏకంగా స్నో బోర్డింగ్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఓ భారతీయురాలు మరో విదేశీ మహిళతో కలిసి చేసిన ఈ సాహనం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, చీరలు కట్టుకున్న ఇద్దరు మహిళ స్నోబోర్డింగ్ చేశారు. స్నో బోర్డు సాయంతో మంచు పర్వతంపై నుంచి కిందకు దూసుకెళుతూ అబ్బురపరిచే రీతిలో విన్యాసాలు చేశారు. చీరలు ధరించిన వారు ఇలాంటి సాహస క్రీడల్లో కూడా పాల్గొనవచ్చని రుజువు చేశారు. ఇక ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
సంప్రదాయక వస్త్రధారణను ఇష్టపడే మహిళలందరి ముఖాల్లో ఈ వీడియో నవ్వులు పూయిస్తుందని అనేక మంది కామెంట్ చేశారు. ఆధునికతకు సంప్రదాయకతను అద్భుతంగా జోడించారంటూ వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోను ఎక్కడ చిత్రీకరించారని మరికొందరు ప్రశ్నించారు. కొందరు మాత్రం వారు హెల్మెట్ పెట్టుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి సాహసక్రీడల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని హితవు పలికారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందీ తెలియకపోయినప్పటికీ వీడియోకు మాత్రం జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.
https://www.youtube.com/shorts/V9zs0hQP3D4


.webp)



