నారా భువనేశ్వరికి రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడి  సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. లండన్ లోని మే ఫెయిర్ హాలు వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు హాజరయ్యారు. 

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో భువనేశ్వరి డిస్టింగ్విష్ డ్ ఫఎలోషిప్ అవార్డును అందుకున్నారు.  సామాజిక ప్రభావం, ప్రజాసేవ అంశాలలో విశిష్ఠ సేవలు అందించినందుకుగాను  అత్యంత ప్రతిష్ఠాత్మక  సామాజిక సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.  అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్స్ లెన్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంగా గోల్డెన్ పీకాక్ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో అందుకున్నారు.

జాతీయ స్థాయిలో ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ ను ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సు గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఐఓడి సంస్థ. ఎంపిక చేసింది. నారా భువనేశ్వరి ప్రజాసేవ, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  ఆమె సేవలకు దక్కిన గొప్ప గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో  అగ్రగామిగా నిలుస్తున్న తీరు పట్ల గర్వంగా ఉందని అన్నారు. అలాగే   ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న తన సతీమణి నారా భువనేశ్వరిని చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu