Latest News

లంచగొండి పోలీసుల సైబర్ సేవలు!

posted on: Mar 10, 2026 7:38AM

సైబర్ నేరాలను అరికట్టా ల్సిన పోలీసులు తామే  లంచం అనే సైబర్ లో చిక్కుకోవడం కలకలం రేపింది. నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులే… నిందితులకు అండగా నిలుస్తూ  కేసు నుంచి బయటపడేందుకు ఏకంగా ఒక ప్యాకేజీని ఆఫర్ చేయడం కలకలం రేపింది. 

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ కార్యాలయంలో పనిచే స్తున్న ఇద్దరు పోలీసులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ గౌడ్, రిజర్వ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ జతావత్ బాబు నాయక్ అనే ఈ ఇద్దరు అధికారులు కలిసి ఒక సైబర్ కేసులో తమ  సేవలకు  భారీ ముడుపు కోరినట్లు బయటపడింది.

సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయకుండా ఉండాలని, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 ప్రకారం  నోటీసులు ఇచ్చి సమయం కల్పించాలని నిందితుడి తరపువారు పోలీసులను కోరారు. దీంతో ఈ ఇద్దరు అధికారులు లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో కంగుతిన్న నిందితుడి తరపు వ్యక్తులు  ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.   ఏసీబీ అధికారుల సూచన మేరకు లంచం ఇస్తామని ఫిర్యాదుదారులు చెప్పడంతో వారు చెప్పిన ప్రదేశానికి వచ్చిన లంచగొండి పోలీసులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

వారిని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.  సైబర్ నేరాలను అరికట్టాల్సిన పోలీసులే  లంచం తీసుకుని నేరస్తులకు రక్షణ  కల్పించే ప్రయత్నం చేయడం ఇప్పుడు పోలీసు విభాగం లో చర్చనీయాంశంగా మారింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...