Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వెనిజులాను కుదిపేసిన భారీ భూకంపాలు
posted on: Jun 25, 2026 11:14AM
.webp)
వెనిజులాను భారీ భూకంపం కుదిపివేసింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. బుధవారం (జూన్ 24) సాయంత్రం ఈ భూకంపం సంభవించింది. 39 సెకన్ల తేడాతో రెండు సార్లు భూమి కంపించింది. తొలి భూకంపం తీవ్రత 7.2గా నమోదైతే.. ఆ వెనువెంటనే సంభవించిన మరో భూకంప తీవ్రత 7.5గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. కరేబియన్ తీరంలోని మొరాన్ నగరానికి సమీపంలో, భూగర్భంలో 10 నుండి 22 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాలు ఉన్నాయి. వందేళ్లలో వెనిజులాలో సంభవించిన భారీ భూకంపాలు ఇవేనని అధికారులు తెలిపారు.
వెనిజులా రాజధాని కారకాస్‌లో భారీ భవనాలు పేకమేడల్లా ఊగిపోయాయి. ఇళ్ల గోడలు కూలిపోయి, భవనాలు దెబ్బతిన్నాయి. ప్రాణభయంతో లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ విపత్తు కారణంగా వెనిజులా ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రజలందరూ ప్రశాంతంగా, ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సైమన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతినడంతో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. అలాగే దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించేందుకు వైద్యులందరూ వెంటనే ఆసుపత్రుల్లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.






