చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
posted on: Feb 2, 2026 11:39AM

ఆడుకుంటూ వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మరణించిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగింది. మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసి తండాలో నివాసం ఉంటున్న జటావత్ రిషి, జటావత్ బద్రీనాథ్ అనే ఇద్దరు చిన్నా రులు గ్రామ సమీపంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాద వశాత్తు చెరువులో పడి మునిగిపోయి మరణించారు.
రెస్క్యూ టీం చెరువులోంచి ఇద్దరు బాలుర మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించింది. ఇద్దరు బాలుర మరణ వార్త వినగానే కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకొని విషాదం వ్యక్తం చేశారు. బాలుర అకాల మృతితో కేసి తండాలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు బాలుర మరణంతో వారి కుటుంబ సభ్యులు మునిగిపోయారు.


.webp)



