Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విద్యుదాఘాతంతో రెండు ఏనుగులు మృతి
posted on: Mar 9, 2026 9:41AM
.webp)
అడవి పందుల బారి నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె కారణంగా రెండు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. విద్యుదాఘాతంలో రెండు ఏనుగులు మృతి చెందిన విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. యర్రవారిపాళెం మండలం నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా సమీపంలో ఈ ఘటన జరిగింది.
విద్యుత్ షాక్ వల్లే ఏనుగులు మరణించినట్లు అటవీ అధికారులు గుర్తించారు. అడవి పందుల నుంచి పంటల రక్షణ కోసం రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి రెండు ఏనుగులూ మరణించినట్లు తెలిపారు. సంఘటన గురించి తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



.webp)


