పెట్రోల్ బంకులో రెండు ఆటోలు దగ్దం!

posted on: May 1, 2026 10:00AM

హైదరాబాద్ నగరంలో పెద్ద ప్రమాదం తప్పింది.   నారాయణగూడ  వైఎంసీఏ సమీపంలోని హిందుస్థాన్ పెట్రోలియం  పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం ( మే1) తెల్లవారుజామున అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్‌లో ఒక ఆటోకు గ్యాస్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆటోలో నుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే నిలిపి ఉంచిన మరో ఆటోకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరెగుతూ దట్టమైన పొగలు ఆ ప్రాంమంతా వ్యాపించాయి.  

వెంటనే అప్రమత్తమైన బంక్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టి అగ్ని మరింత వ్యాపించకుండా నియం త్రించారు.ఈ ఘటనలో బంక్ సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. అతని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అగ్నిప్రమాదం కారణంగా రెండు ఆటోలు పూర్తిగా దగ్ధమ య్యాయి.సమయానికి చర్యలు తీసుకోవడంతో పెట్రోల్ బంక్‌కు మంటలు వ్యాపించకుండా నిలువ రించగలిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...