Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలపై ట్విస్ట్.!
posted on: Jul 15, 2026 2:08PM

అనారోగ్యంతో మరణించిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మ నాభం అంత్యక్రియలకు కిర్లంపూడిలో ఏర్పాట్లు జరుగుతు న్నాయి. ఈ నేపథ్యంలో అంత్యక్రియలను అధికా రిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్‌లో చర్చించుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ముద్రగడ పద్మనాభం అందించిన ప్రజాసేవలను గుర్తిస్తూ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబం ధిత అధికారులకు సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.
అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్ర గడ కుటుంబ సభ్యులు తిరస్కరిం చారు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే కిర్లంపూడిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం, కుటుంబం వైఖరి చర్చనీయాంశంగామారింది.
ఇదిలా ఉండగా.. తండ్రికి చివరి నివాళులు అర్పించేందుకు ముద్రగడ కుమార్తె క్రాంతి కిర్లంపూడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆమెను అడ్డుకున్నారు. గో బ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు డీఎస్పీ తిలక్ స్వయంగా రంగంలోకి దిగి క్రాంతితో మాట్లాడారు. అనంతరం ఆమె తండ్రి భౌతికకాయా నికి నివాళులు అర్పించారు.
Mudragada Padmanabhams funeral, official honors, Mudragada family, Reject






