Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీతారాం కేసుల్లో ట్విస్ట్...భర్త చనిపోయిన నెలరోజులకే ప్రియుడితో పెళ్లి
posted on: May 1, 2026 7:49PM

హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లిలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.. భర్త చనిపోయి కేవలం నెలరో జులు కూడా కాకముందుకే భార్య అందరికీ ఓ ట్విస్ట్ ఇచ్చింది... అది విన్న కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. మొదట సాధారణ కుటుంబ వివాదంగా భావించిన ఈ కేసు, తర్వాత బయటపడిన విషయాలతో ఒక్కొక్కటిగా కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. సీతారాం ఐటీ కంపెనీలో పనిచేస్తూ భార్య రేణుక, ఇద్దరు పిల్లలతో కలిసి బాచుపల్లిలో నివసించేవాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన భార్యకు అనేక అక్రమ సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో సీతారాం తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
ఫిబ్రవరి నెలలో ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. అయితే సీతారాం ఆత్మ హత్య చేసుకోబోయే ముందు ఒక 19 పేజీల సూసైడ్ నోట్ రాసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సూసైడ్ నోట్ ద్వారా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి... తన భార్యకు ఆరుగురు ప్రేమికులు ఉన్నారని అతను తన సూసైడ్ నోట్లో రాశాడు. ఈ విషయం తెలిసిన తర్వాత తన భార్యను పలుమార్లు మందలించానని అయినా కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని దీంతో విసుగు చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నా నని సీతారాం తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
అయితే ఇదిలా ఉండగా ఈ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది.. ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం మరణించడంతో కుటుంబ సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు. ఇక మరోవైపు భర్త సీతారాం చనిపోయి నెల రోజులు కూడా గడవక ముందే, మార్చి నెలలో రేణుక మరో వివాహం చేసుకుంది కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియకుండా రహస్యంగా రేణుక తాను గాఢంగా ప్రేమిస్తున్న ప్రియుడిని పెళ్లి చేసుకుంది... ఈ విషయం బయటకు రావడంతో కేసు దిశ పూర్తిగా మారింది.
పోలీసుల దర్యాప్తులో రేణుక తన మాజీ ప్రియుడు రమణారెడ్డిని వివాహం చేసుకున్నట్లుగా వెల్లడైంది. ఈ వివాహం త్వరగా జరగడం, అలాగే సీతారాం ఆత్మహత్యకు ముందు ఉన్న వివాదాల నేపథ్యంలో పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మరణంగా పరిగణించి విచారణ వేగ వంతం చేశారు. సీతారాం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు, సేకరించిన సాక్ష్యాలు, కాల్ డేటా, సందేశాలు తదితర వివరాల ఆధారంగా పోలీసులు కేసును లోతుగా పరిశీలించారు. దర్యాప్తులో బయటపడిన అంశాల ఆధారంగా బాచుపల్లి పోలీసులు రేణుకతో పాటు రమణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సీతారాం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, ఎవరి పాత్ర ఎంత ఉందన్న కోణంలో విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



.webp)


