అనంతలో తల్లీ కొడుకుల దారుణ హత్య

posted on: Feb 3, 2026 8:09AM

అనంతపురం జిల్లాలో తల్లీకొడుకుల దారుణ హత్య కలకలం సృష్టించింది.  శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన నల్లప్పకు ఇద్దరు భార్యలు. ఆయన మరణించిన తరువాత ఆస్తి పంపకాల విషయంలో మొదటి భార్య పిల్లలకు, రెండో భార్యకు మధ్య కొంతకాలంగా తీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్న నల్లప్ప రెండో భార్య యల్లమ్మ, ఆమె కుమారుడు చిన్నా  దారుణ హత్యకు  గురయ్యారు. నల్లప్ప మొదటి భార్య న కుమారులే ఈ హత్యలకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూమి సహా ఆస్తుల పంపిణీపై తలెత్తిన ఘర్షణలే ఈ జంట హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.  నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని  పోలీసులు తెలిపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...