Latest News

హైదరాబాదు నగరంలో జంట హత్యల కలకలం

posted on: Mar 14, 2026 1:04PM

 

హైదరాబాద్  పఠాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు  కలకలం రేపాయి. నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న  దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి,  పఠాన్ చెరు పరిధిలోని ఇంద్రేషం ప్రాంతంలోని సిటిజెన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనానికి వాచ్‌మన్‌లుగా పనిచేస్తున్న సోమ్లా దశరథ్,  మాన్యమ్మ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. శనివారం (మార్చి 14) ఉదయం సమయంలో ఈ ఘటన వెలుగుకి వచ్చింది.

 ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు మహబూబాబాద్ జిల్లా లోని గురుడు మండలం లోని దొంగ చింత తాండకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చిన ఈ దంపతులు నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్‌ మన్‌లుగా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు.  ఈ ఘటన ఎలా జరిగిందన్నది ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు. హత్యలకు గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు  క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యలు దొంగతనం కోణంలో జరిగాయా? లేక వ్యక్తిగత విభేదాల కారణంగా జరిగాయా? అన్నది తేలాల్సి ఉంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...