Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాతబస్తీలో జంట హత్యలు...నిందితుడు పరారీ
posted on: Apr 20, 2026 8:38PM
.webp)
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరు ఖాన్ బజార్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, అదిల్ ఖాన్ అనే వ్యక్తి తన సోదరుడు అఖ్వీల్ ఖాన్‌తో పాటు అజ్మీరి బేగంను ఇంట్లోనే దారుణంగా హత్య చేసి పరారైనట్లు సమాచారం. ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మీర్ చౌక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.
హత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులకు నలుగురు సంతానం ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. మృతుడు డ్రైవర్‌గా, నిందితుడు వెల్డర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. నిందితుడికి సంతానం లేకపోవడం వల్ల మృతులు అతన్ని ఆటపట్టించేవారని, అదే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.



.webp)


