కుప్పకూలిన కార్గో విమానం..32 మంది మృతి..

posted on: Jan 16, 2017 10:37AM

 

కిర్గిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టర్కీ ఎయిర్ లైన్స్ కార్గో విమానం కూలిపోయి 32 మంది దుర్మరణం చెందారు. వివరాల ప్రకారం... హాంకాంగ్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కీ ఎయిర్‌లైన్స్ కార్గో విమానం మానస్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ల్యాండింగ్ కు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఎయిర్ పోర్టుకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 32 మంది ప్రాణాలు కోల్పోగా..మృతుల్లో ఆరుగురు చిన్నారులు, నలుగురు పైలట్లు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానం కూలడంతో సుమారు 15 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...