అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో టర్కీ కుట్ర కోణం?
posted on Jun 16, 2025 12:41PM

కొందరు చెబుతున్న అభిప్రాయాన్ని బట్టి చెబితే ఫ్లైట్ AI171 అహ్మదాబాద్ టు లండన్ ఫ్లయిట్ యాక్సిడెంట్ కి సంబంధించి వార్తలు కాదు.. విజువల్స్ చూడాలి. ఇదంతా ప్రీప్లాన్డ్ కాకుంటే అన్నది వీరి వాదన. ఒక యాక్సిడెంట్ ని ఇంత క్లియర్ కట్ గా ఒకరు ఎలా తీయగలరు? ఈ మధ్య కాలంలో మనం చూసే ఉంటాం.. భారత్ పాక్ వార్ లో టర్కీ పాక్ కి చేసిన డ్రోన్ హెల్ప్. దీన్ని బట్టి చూస్తే ఇక్కడున్న టర్కీ యాంగిల్ ఒకటి బయట పడుతుంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో మే 15 వరకు టర్కిష్ సంస్థ అయిన సెలెబి గ్రౌండ్ సర్వీసెస్.. గ్రౌండ్ ఆపరేషన్‌లను నిర్వహించింది. ఇదే ఇక్కడ అనుమానాస్పందంగా మారింది. కేవలం ఒకే ఒక్క ఇంజిన్ తో సముద్రాలను అవలీలగా దాటగలిగిన బోయింట్ 787 ఫ్లైట్ ఏంటి.. 45 సెకన్లలో ఇలా కుప్ప కూలడమేంటి? అన్నదెవరికీ అర్దం కావడం లేదు. రెండు ఇంజిన్లు ఫెయిల్ అయినా కూడా అంత వేగంగా ఇంత భారీ విమానం కుప్పకూలడం అసాధ్యం అన్నది నిపుణుల మాట. విమానం టేకాఫ్ నుంచి కుప్ప కూలిపోయే వరకూ దాని సెకన్ టు సెకన్ సిట్యువేషనేంటో చూస్తే.. 00:00 సెకన్ల సమయంలో టేకాఫ్.. స్మూత్ గా అయ్యింది. 00:10 సెకన్ల వద్ద ఫ్లైట్ పైకి లేచింది. 00:20 టైంలో – ఫ్లాప్‌లు వెనక్కి తగ్గలేదు. 00:25 సమయంలో ల్యాండింగ్ గేర్ ఇంకా కిందే ఉంది. 00:28 సెకన్లపుడు – ఆర్ఏటి మోహరించబడి ఉంది. 00:29 టైంలో – పైలట్ మేడే కాల్ పంపారు. రియాక్షన్ రాలేదు. 00:35 సెకన్లపుడు విమానం కిందకు వంగింది. ఆపై నియంత్రణ కోల్పోయింది. 00:45 సెకన్ల టైంలో – క్రాష్ అయింది.
ఇందులో ఏదో కుట్ర కోణం దాగి ఉంటుందని భావిస్తున్నారు కొందరు నిపుణులు. ఇలా ఎప్పటికీ జరగదని అంటారు వీరు. కారణమేంటంటే కోటిలో ఒక్కసారి కూడా సెకన్లలో ఒక విమానం డెడ్ అయ్యి ఇలా పూర్తిగా కింద పడిపోదు. ఇందులో ఏదో ఒక ఆపరేషన్ జరిగి ఉంటే తప్ప.. ఇందులో పక్షి సిద్దాంతం ఒకటి చెబుతున్నారు కానీ.. అది కూడా పూర్తిగా తప్పు.. ఎలాంటి పక్షులు విమానాన్ని ఢీ కొట్టలేదని తెలుస్తోంది. పూర్తిగా విద్యుత్ ఫెయిల్యూర్ సైతం రాట్ ని ప్రేరేపించదని అంటున్నారు. ఒక ఇంజిన్ టేకాఫ్ అయ్యే కెపాసిటీ కలిగి ఉందంటే అందులో దాదాపు ఎలాంటి ప్రమాదకరమైన సంకేతాలు లేనట్టే.. ముప్పై సెకన్లలో కుప్ప కూలిపోయే విమానం అసలు అక్కడి నుంచి కదలక మొరాయిస్తుందని అంటారు ఏవియేషన్ ఎక్స్ పర్ట్స్.
అందుకే వీరు ఇది యాంత్రిక లోపం కాదు. యాధృచ్చికం అంతకన్నా కాదు. ఇందులో ఏదో ఒక ఆపరేషన్ జరిగింది. లేకుంటే డ్రీమ్ లైనర్ లాంటి ఒక టెక్నికల్లీ హై ఎండ్ విమానమేంటి ఇలా కుప్పకూలిపోవడమేంటి? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతటి వీక్ మెయిన్ టైన్స్ లో ఈ సంస్థకు చెందిన విమానాలు లేవన్నది నిపుణుల మాట.
ఫ్లాప్‌లు ప్లస్ గేర్ ప్లస్ ఆర్ఏటి ప్లస్ బ్లాక్అవుట్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్ సిస్టమ్ విధ్వంసం. ఇదీ ఈక్వేషన్.. ఎలా అని చూస్తే ట్యాంపర్డ్ ఏవియానిక్స్, రోగ్ ఫర్మ్‌వేర్ ప్యాచ్, ఇఎమ్ సిగ్నల్ జామింగ్, వైరింగ్ విధ్వంసం ఇంత వేగంగా జరిగాయంటే ఇందులో రాజీ పడ్డ సిబ్బంది హస్తమేదైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు జరగాల్సి ఉంది.
ఇక్కడ మే 15 వరకూ సెలబీ గ్రౌండ్ సర్వీసెస్ సంస్థ ఆపరేషన్లు నిర్వహించగా.. దీనికి విమానాల విషయంలో పూర్తి యాక్సెస్ ఉంది. విమానం ఎలక్ట్రానిక్ బే వరకు - మరీ మాట్లాడితే దాని మెయిన్ సిస్టమ్ వరకు ఈ సంస్థ చొచ్చుకుపోగలదు. ఇది కేవలం యాక్సిడెంట్ కాదు. ఇందులో ఏదో మతలబు దాగి ఉందని చెబుతోంది ఇందుకే.
అయితే టర్కిష్ సంస్థ ఈ కుట్ర కోణాన్ని ఖండిస్తోంది. ఎయిర్ ఇండియా టర్కీ టెక్నికల్ కంపెనీ మధ్య 2024- 25 మధ్య ఒక ఒప్పందం జరిగిన మాట నిజమే కా నీ.. అది బోయింగ్ 787-8 కి కాదు. బీ 777కి మాత్రమే అంటోందీ టర్కిష్ కంపెనీ. అయితే వారికి గ్రౌండ్ సర్వీస్ లో భాగంగా అన్ని విమానాలకూ ఒక యాక్సెస్ ఉంటుందని అంటారు నిపుణులు. మరి చూడాలి.. టర్కీ కుట్ర కోణంలో నిజానిజాలేంటో ఈ ప్రమాద విచారణకు చెందిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకూ ఏమీ చెప్పలేం అన్నది కొందరి మాట.