మొంథా తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో బీచ్ లు మూసివేత

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది ఏపీవైపునకు దూసుకువస్తున్నది. దీని ప్రభావంతో  ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని పోర్టులలోనూ ఐదో నంబర్ ప్రమాద హచ్చరిక జారీ చేశారు.

ముఖ్యంగా ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై తీవ్రప్రభావం చూ   అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో దాదాపు అన్ని బీచ్ లనూ మూసివేశారు. విశాఖ రుషికొండ, సాగర్ నగర్ బీచ్ లను మూసివేశారు. పర్యాటకులెవరూ తీరప్రాంతానికి రావద్దన్న స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.   ఈ తీవ్ర తుపాను మంగళవారం  సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 తీవ్ర తుపాను నేపథ్యంలో భారత సైన్యాన్ని తీర ప్రాంతాలలో సహాయక చర్యల కోసం సన్నద్ధం చేశారు.  ఇప్పటికే  తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలలో విప్త్తు సహాయక బృందాలను తరలించారు.  తుపాను కదలికలను, తీవ్రతను ఆర్టీ నిరంతరం పరిశీలిచి పరిస్థితిని సమీక్షిస్తున్నది.   తుఫాన్ గాలులు, అలల తీవ్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నారు. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలకు తోడు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu