Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుంది : తలసాని
posted on: Jul 2, 2026 3:56PM

కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసింది. చేసిన అప్పులతో ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పని కూడా చేయలేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ అద్భుతమైన అభివృద్ధి చేశారని అన్నారు.
అధికార పార్టీ నాయకులు బూతులు మాట్లాడితే కేసులు నమోదు కావడం లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్న తమపై మాత్రం కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ వ్యవస్థలు శాశ్వతమని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు, ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం లేదని ఆరోపించారు. మంత్రుల ఆహ్వానం మేరకే హరీశ్ రావు గన్‌పార్క్‌కు బయలుదేరారని, అలాంటి పరిస్థితిలో ఆయనను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రులకు ధైర్యం ఉంటే కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌కు రావాలని సవాల్ విసిరారు. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సతీమణి లక్ష్మీభాయిని లూప్ లైన్ పోస్టుకు బదిలీ చేశారని ఆరోపించారు. ఇది ప్రభుత్వం నడుస్తుందా, సర్కస్ నడుస్తుందా అన్న సందేహం కలుగుతోందని, ప్రభుత్వం సర్కస్ కంపెనీలా వ్యవహరిస్తూ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. సవాళ్లు విసిరిన మంత్రులు చివరికి పిరికిపందల్లా వెనక్కి తగ్గారని అన్నారు.






