Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీటీడీ ట్రస్టుల దాతలకు కొత్త నిబంధనలు..!
posted on: Jul 14, 2026 6:55PM
.webp)
టీటీడీలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశం అనంతరం, ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, ఏకరీతి తీసుకురావాలనే ఉద్దేశంతో టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్‌లో మార్పులు చేపట్టినట్లు చెప్పారు. ఈ కొత్త నిబంధనలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అయితే, ఇప్పటికే విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:
రూ.6.31 కోట్లతో తిరుమలలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు కలిగిన భక్తులు వేచి ఉండేందుకు ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి టెండర్లకు ఆమోదం.
కుమారధార, పసుపుధార డ్యామ్‌ల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి రూ.2.77 కోట్ల మంజూరుకు ఆమోదం.
గ్రీన్ ఎనర్జీ అభివృద్ధిలో భాగంగా జీఎన్‌సీ సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్‌ను విష్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ విరాళంగా ఏర్పాటు చేసి, టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి ఆమోదం.
తిరుమల ఎస్వీ మ్యూజియంలో 12 ఏళ్లు పైబడిన సందర్శకులకు జీఎస్‌టితో కలిపి రూ.50 ప్రవేశ రుసుము నిర్ణయం. మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా సంస్థకు అప్పగించేందుకు ఆ సంస్థను సంప్రదించాలని నిర్ణయం.
కాకులమానుతిప్ప సమీపంలోని 25 ఏళ్లకు పైబడిన ఘన వ్యర్థాలను బయో-రిమీడియేషన్, బయో-మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి రూ.5 కోట్ల మంజూరుకు ఆమోదం.
భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థల సమగ్ర నిర్వహణ కోసం రూ.2.35 కోట్లతో పనులు కొనసాగించేందుకు నిర్ణయం.
తిరుమలలోని టిబీసీ, ఏటీసీ విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత భవనాలను తొలగించి, వాటి స్థానంలో దాతల సహకారంతో కొత్త భవనాలు నిర్మించేందుకు నిర్ణయం.
2027 సంవత్సరానికి సంబంధించి 10 లక్షల డైరీలు, 13.50 లక్షల 12 పేజీల క్యాలెండర్లు, 75 వేల 6 పేజీల క్యాలెండర్ల ముద్రణకు ఆమోదం.
తిరుమల ఆక్టోపస్ బేస్ క్యాంప్‌లో అదనపు మౌలిక సదుపాయాలు, ఎఫ్‌ఎంఎస్ సేవల కోసం రూ.2.91 కోట్ల మంజూరు.
ఒంటిమిట్ట శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారి మూలవిరాట్టులకు బంగారు కవచాల తయారీ కోసం టీటీడీ ట్రెజరీలోని వెయ్యి గ్రాముల బంగారం వినియోగానికి ఆమోదం.
రూ.17.84 కోట్లతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద యాత్రికుల కోసం 100 గదుల విశ్రాంతి గృహం నిర్మాణానికి టెండర్ల ఆమోదం.
ఒంటిమిట్ట ఆలయం ఈశాన్య మాడవీధి విస్తరణ, యాత్రికుల సౌకర్యాల అభివృద్ధి కోసం 6,103 చదరపు అడుగుల భూమి సేకరణ నిమిత్తం జిల్లా యంత్రాంగానికి రూ.2.11 కోట్ల చెల్లింపునకు ఆమోదం.
తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ మండపంపై సాలహారం నిర్మాణం, మిగిలిన ప్రాకార గోడ నిర్మాణానికి రూ.2.50 కోట్ల టెండర్‌కు ఆమోదం.
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల నిత్య పారాయణం నిరంతరాయంగా జరిగేలా, రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో కూడా లోకకల్యాణార్థం వేద పారాయణ కార్యక్రమాలను విస్తరించేందుకు వేద పారాయణ స్కీం ద్వారా 791 మంది సంభావన వేద పండితులను నియమించేందుకు నిర్ణయం.
హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల తదితర విభాగాల్లో పనిచేస్తున్న కళాకారుల నైపుణ్యాన్ని బట్టి వారి పారితోషికాలను పెంచేందుకు ఆమోదం.
టీటీడీ క్యాంటీన్ల విభాగంలోని 65 సర్వర్ల పోస్టులను క్యాటరింగ్ సూపర్‌వైజర్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు నిర్ణయం. ఈ సమావేశంలో పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో డా. ఎ. శరత్, సీవీఎస్‌వో మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
TTD, TTD Board Meeting, B.R. Naidu, Donor Privileges, New Donor Policy, Trusts and Schemes
New Guidelines, Effective from Midnight, SSD Devotees






