శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

posted on: Nov 2, 2025 9:38AM

 

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం  30 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం 72,860 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగా 31,612 మంది తలనీలాలు సమర్పించారు. 

హూండీ ద్వారా రూ. 2.98 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఉదయం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ.వి.రవీంద్రబాబు, తమిళనాడు మంత్రి రామచంద్ర, హీరో నారా రోహిత్ దంపతులు దర్శించుకున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...