Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హాట్ టాపిక్ గా ట్రంప్ రోడ్డు.. శిలాఫలకం ఆవిష్కరించిన బట్టి పేరే లేదు!
posted on: Jun 25, 2026 2:13PM

హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికా కాన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అగ్రరాజ్యం అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రత్యేక గౌరవాన్ని కల్పించింది. ఫ్రీడమ్ 250 పేరిట నిర్వహించిన వేడుకకు అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి ఆ రోడ్డు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని పటిష్టం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.
అయితే.. ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
మరోవైపు, ఈ రోడ్డు నామకరణంపై రాజకీయంగా కూడా పెద్ద దుమారమే రేగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో డొనాల్డ్ ట్రంప్ విధానాలను, ముఖ్యంగా భారత్‌పై విధిస్తున్న వాణిజ్య సుంకాలను తీవ్రంగా విమర్శించారని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అమెరికా అధ్యక్షుడిని భారత వ్యతిరేకిగా చిత్రీకరిస్తుంటే.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆయన పేరు ఏకంగా ఒక రోడ్డుకు పెట్టి అత్యున్నత గౌరవాన్ని ఇవ్వడం ఏంటని నిలదీశారు. రాహుల్ హిపోక్రసీ ప్రో మాక్స్ అని ఎద్దేవా చేశారు. గతంలో అదానీ గ్రూపుపై రాహుల్ విమర్శలు చేసినప్పటికీ.. సీఎం రేవంత్ రెడ్డి అదానీతో ఒప్పందాలు చేసుకున్నారని, ఇప్పుడు ట్రంప్ విషయంలోనూ రేవంత్ రెడ్డి అసలు రాహుల్ గాంధీ మాటలను ఏమాత్రం లెక్కచేయడం లేదని బీజేపీ విమర్శలు గుప్పించింది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ వివాదాలు ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణ , అమెరికా మధ్య వాణిజ్య, సాంకేతిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతున్నాయని ఈ వేడుక స్పష్టం చేసింది. ఈ ప్రాంతం నుంచి జరుగుతున్న ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు ద్వైపాక్షిక సంబంధాలను శాసిస్తున్నాయని అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్ ప్రశంసించారు. మిషన్ ఇండియా' చొరవ, తాత్కాలిక వాణిజ్య ఒప్పందాల ద్వారా అమెరికాలోకి ఏకంగా 20 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో 1.66 లక్షల కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు రాబోతున్నాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. అమెరికా ఫస్ట్ అంటే అమెరికా ఒంటరిగా ఉండటం కాదన్నారు. ట్రంప్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా ఒకవైపు అంతర్జాతీయ పెట్టుబడుల జోరు, మరోవైపు ప్రోటోకాల్ వివాదాలు, రాజకీయ విమర్శలతో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నిలిచింది.


.webp)



