నోబెల్ కోసం ట్రంప్ ‘కల’ వరం

నోబెల్ శాంతి పురస్కారం ప్రకటనకు ప్రకటనకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారం రేసులో ముందంజలో ఉన్నారు.  నోబెల్ శాంతి పురస్కారం ప్రకటనకు ప్రైజ్ ప్రకటనకు ఒక్క రోజు ముందు.. దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాయెల్-గాజా ఘర్షణలో.. కీలకమైన శాంతి ఒప్పందాన్ని కుదిర్చినట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  నిజంగానే ట్రంప్‌ని నోబెల్ శాంతి పురస్కారం వరిస్తుందా? అన్న చర్చ మొదలైంది.
నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్ ను వరిస్తుందా? అన్న ఆశక్తి ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమౌతోంది.  కొన్నాళ్లుగా నోబెల్ శాంతి పురస్కారం కోసం ట్రంప్ పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. ఈ పురస్కారం దక్కించుకోవాలని ఆయన కలకంటున్నారు. దక్కదేమో అని కలవర పడుతున్నారు. ఏకంగా ఐక్యరాజ్యసమితి వేదికగానే.. తాను ఏడు యుద్ధాలు ఆపి,  శాంతిని నెలకొల్పిన వ్యక్తిగా ఆయనంతట ఆయనే ప్రకటించేసుకున్నారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పనిని కూడా తానే చేశాన్న ఆయన స్వోత్కర్ష  అప్పట్లో వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌‌గా మారింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ తాను నోబెల్ శాంతి బహుమతికి ఎందుకు అర్హుడిననే విషయాలు  షేర్ చేస్తూ వచ్చిన ట్రంప్. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది కూడా తానేనని ప్రకటించుకున్నారు. భారత్ నిర్ద్వంద్వంగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించినా పట్టించుకోలేదు. పదే పదే అదే మాట చెబుతూ వస్తున్నారు. 

ఇలా కొన్నాళ్లుగా నోబెల్ శాంతి పురస్కారం కోసం కోసం ట్రంప్  ఆరాటపడుతున్నారు. తనను తానే ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా నోబెల్ పురస్కార ప్రకటనకు ఒక్క రోజు ముందు..  దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాయెల్-గాజా వివాదంలో కీలకమైన శాంతి ఒప్పందాన్ని తాను కుదిర్చినట్లు ప్రకటించుకున్నారు.  దీనికి తోడు వైట్ హౌజ్ ఆయనని  ద పీస్ ప్రెసిడెంట్  అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేసింది.  దీంతో ట్రంప్ నోబెల్ పురస్కారం అందుకోవాలన్న పిచ్చి పీక్స్ కు చేరిందంటూ నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అది పక్కన పెడితే వైట్ హౌస్ ఆయనను పీస్ ప్రెసిడెంట్ గా అభివర్ణించడం ట్రంప్ పీస్ రేసుకి  ఊతమిచ్చినట్లయిందని పరిశీలకులు అంటున్నారు.  మొత్తం మీద నిజంగానే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందా?  వైట్ హౌజ్ హంగామాని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ తొలి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్‌ తెలిపారు.  ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేశాయని తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు.  గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు  ఇదొక అపూర్వ అడుగుగా ట్రంప్‌ అభివర్ణించారు.  నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడానికి ఒక్క రోజు ముందు ఈ ఒప్పందం కుదిరింది. 79 ఏళ్ల ట్రంప్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఇది. ఇలాంటి క్షణంలో  వైట్ హౌజ్ చాలా తెలివిగా పీస్ ప్రెసిడెంట్ అంటూ  ట్వీట్ చేసింది.

మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం నోబెల్ కమిటీ తనకు బహుమతి ఇవ్వకుండా ఉండేందుకు,  ఓ మార్గాన్ని కనుగొంటుందనీ,  వాళ్లు శాంతి స్థాపన కోసం ఏమీ చేయని వ్యక్తికే  ఈ పురస్కారం ఇస్తారనీ అనడం చర్చనీయాంశంగా మారింది.  అంతేకాదు  తాము రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించేందుకు కూడా దగ్గరగా ఉన్నామని ట్రంప్ చెప్పుకుంటున్నారు. చరిత్రలో ఎవరూ కూడా ఇన్ని యుద్ధాలు పరిష్కరించదంటూ తన భుజాలను తానే చరిచేసుకుంటున్నారు ట్రంప్.  అంతే కాదు.. తనకు నోబెల్ పురస్కారం దక్కకపోతే అది అమెరికాకే పెద్ద అవమానం అవుతుందంటున్నారు ట్రంప్.  అమెరికాకే  నోబెల్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నానని  వర్జీనియాలో జరిగిన ఉన్నత స్థాయి సైనిక సమావేశంలో అన్నారు.  మొత్తానికి.. ప్రెసిడెంట్  ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారం కోసం  చాలాచాలా పెద్ద ప్రయత్నాలే చేస్తున్నారు. తనను తాను యుద్ధాలను ఆపిన శాంతి దూతగా ప్రమోట్ చేసుకోవడమే కాకుండా, నోబెల్ కమిటీని బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు.  

నిజం చెప్పాలంటే.. ట్రంప్ ప్రపంచానికి వ్యతిరేకంగా పోటీ పడుతున్నారు. యుద్ధాల్లో జోక్యం చేసుకోవడం, శాంతి కోసం ఒప్పించేందుకు ప్రయత్నించడం లాంటివన్నీ,  నోబెల్ కోసమే చేస్తున్నారని క్లియర్‌గా తెలుస్తోంది.  దానికితోడు రిపబ్లికన్ నేతలు, అనేకమంది ప్రపంచ నాయకులు ట్రంప్‌ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు.  ఇప్పుడు కూడా రెండేళ్లుగా కొనసాగుతున్న గాజా యుద్ధాన్ని ఆపడంతో ట్రంప్‌కు  మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కసరత్తు అంతా నోబెల్ కమిటీని ప్రభావితం చేసేందుకేననే చర్చ జరుగుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu