ట్రంప్ నోట మళ్లీ అదేమాట.. తన వల్లే భారత్, పాక్ యుద్ధం ఆగిందంటూ పాత పాట

posted on: Feb 20, 2026 2:28PM

ట్రంప్ నోట మళ్లీ అదే మాట వచ్చింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగడానికి తన చొరవే కారణమని మరోసారి ట్రంప్ పేర్కొన్నారు.  భారత్, పాకిస్థాన్ మధ్య గత ఏడాది తలెత్తిన ఉద్రిక్తతలు తన చొరవ వల్లే సద్దుమణిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. వాషింగ్టన్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తాను సుంకాలు విధిస్తానంటూ బెదరించడం వల్లనే భారత్, పాకిస్థాన్ లు వెనక్కు తగ్గాయని చెప్పుకున్నారు.

ఆ సమయంలో ఇరు దేశాలూ యుద్ధానికి సిద్ధమయ్యాయన్న ట్రంప్.. తాను ఫోన్ చేసి తీవ్ర హెచ్చరికలు జారీ  చేశాననీ, యుద్ధం ఆపకుంటే ఆయా దేశాల ఉత్పత్తులపై  200 శాతం సుంకాలు విధిస్తానని వార్నింగ్ ఇచ్చాననీ, అందువల్లే ఆ రెండు దేశాలూ యుద్ధం విషయంలో వెనక్కు తగ్గాయనీ ట్రంప్ చెప్పారు.   ట్రంప్ వాదనలను భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్‌తో ఎలాంటి మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించలేదని, కేవలం డీజీఎంవో స్థాయిలోనే చర్చలు జరిగాయని స్పష్టం చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...