Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్తరకొరియా వద్ద 57 అణ్వాయుధాలు.. కిమ్‌తో భేటీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
posted on: Aug 20, 2026 10:43AM

ఉత్తరకొరియా అణు కార్యక్రమాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉత్తర కొరియా వద్ద 57 శక్తిమంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశం వద్ద అన్ని అణ్వాయుధాలు ఉండటం సరికాదన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు తాను త్వరలోనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశమౌతానన్నారు. తాను వరుసగా రెండో సారి కూడా అధ్యక్షుడిగా గెలిచి ఉన్నట్లైతే ఉత్తర కొరియా అణు సామర్థ్యం ఈ స్థాయిలో విస్తరించి ఉండేది కాదన్న ట్రంప్.. కిమ్‌తో తనకు ఉన్న వ్యక్తిగత సంబంధాలు రాబోయే రోజుల్లో దౌత్యపరమైన చర్చలకు దోహదపడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే ఇరాన్ అణు సామర్థ్యంపై ట్రంప్ మాట్లాడుతూ.. ఆ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను సాధించకుండా అడ్డుకుంటామని పునరుద్ఘాటంచారు. ట్రంప్ ఒకవైపు ఇరాన్‌పై కఠిన వైఖరి అవలంబిస్తూనే, మరోవైపు ఉత్తరకొరియా పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించడం ఆయన ద్వంద్వ నీతికి అద్దంపడుతోందని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరకొరియాతో సత్సంబంధాలు పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ట్రంప్ ఉన్నారనడానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. దక్షిణకొరియాతో మిలిటరీ భాగస్వామ్యాన్ని పక్కనబెట్టి, కిమ్‌తో స్నేహాన్ని విదేశాంగ విధాన విజయంగా చిత్రీకరించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.
అయితే.. ట్రంప్ ప్రకటనలపై ఉత్తరకొరియా స్పందించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి.. ఆ దేశ కీలకమైన అధికారిణి అయిన కిమ్ యో జోంగ్ ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ట్రంప్ తన సోదరుడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారనడంలో ఇసుమంతైనా వాస్తవం లేదని కుండబద్దలు కొట్టారు. నార్త్ కొరియా.. తన అణు భద్రత విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని విస్పష్టంగా పేర్కొన్నారు. దక్షిణ కొరియాతో ఉమ్మడి సైనిక విన్యాసాలు తగ్గించినంత మాత్రాన తమ వైఖరి మారుతుందనుకోవడం భ్రమేనని కిమ్ యోజోంగ్ పరోక్షంగానైనా ట్రంప్ కు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
Trump North Korea Nuclear Weapons, Kim Jong Un Donald Trump Meeting, North Korea Nuclear Arsenal, Kim Yo Jong Statement, US South Korea Joint Military Exercises






