Latest News
దావోస్ లో ట్రంప్ విందు.. ఇండియన్ సీఈవోలకు ఆహ్వానం!
posted on: Jan 21, 2026 8:40AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విందుకు ఏడుగురు భారతీయ సీఈఓలకు ఆహ్వానం అందింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాత అధినేతలు, వ్యాపారులు, పెట్టుబడిదారులు, రాజకీయ ప్రముఖులు తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా దాదాపు ఆరేళ్ల తర్వాత దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొంటున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ట్రంప్ పాల్గొనడం ఇది మూడో సారి.
అదిపక్కన పెడితే.. ట్రంప్ విందుకు టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ మిట్టల్, విప్రో సీఈఓ శ్రీని పల్లియా, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, బజాజ్ ఫిన్ సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్, మహీంద్రా గ్రూపు సీఈఓ అనీశ్ షా, జుబిలెంట్ భర్తియా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు హరి భర్తియాలకు ఆహ్వానం అందింది. ట్రంప్ విందుకు భారత దిగ్గజ వాణిజ్య సంస్థలకు చెందిన సీఈవోలకు ప్రత్యేకంగా ఆహ్వానంఅందడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక వైపు భారత్ పై టారిఫ్ వార్ చేస్తున్న ట్రంప్, అదే దేశానికి చెందిన ప్రముఖ కంపెనీల సీఈవోలకు ఆహ్వానం పలకడం విశేషం.






