Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ట్రంపును వెదుక్కుంటూ వచ్చిన ఆడాళ్ల వీడియో!
posted on: Oct 9, 2016 3:43PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచ నాయకుడ్ని ఎన్నుకోవటమే. ఇది కొంచెం అతిగా అనిపించినా, కొందర్ని హర్ట్ చేసినా ... నిజం! అమెరికన్ ప్రెసిడెంట్ ప్రభావం మొత్తం వాల్డ్ పైన వుంటుంది. అందుకే, యూఎస్ లో ఎలక్షన్స్ వచ్చాయంటే ప్రతీ నాలుగేళ్లకోసారి అన్ని దేశాలూ కన్నర్పాకుండా అక్కడి పరిణామాలు గమనిస్తుంటాయి...
ట్రంప్ , హిల్లరీల మధ్య ఈ సారి చారిత్రక పోరు జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే అమెరికాలో ఇంత వరకూ మహిళా అధ్యక్షురాలే లేదు. కనీసం పోటీ కూడా చేయలేదు. ఇప్పుడు తొలిసారి హిల్లరీ టాప్ చెయిర్ కోసం టాప్ గేర్లో పరుగు తీస్తోంది. కాని, అంతే భీభత్సంగా ఆమెను ఓవర్ టేక్ చేయాలనుకుంటున్నాడు డోనాల్డ్ ట్రంప్.వృత్తి రిత్యా ఫక్తు బిజినెస్ మ్యాన్ అయిన ఆయన అమెరికన్లకు ఎప్పటికప్పడు పిచ్చ షాక్ లిస్తున్నాడు. ముస్లిమ్ లను దేశంలోకి రానీయనని , మెక్సికో సరిహద్దులో గోడ కడతానని ... ఇలా ట్రంప్ మాటలు దేనికవే ఆణిముత్యాలు!
అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి మరో నెల రోజులు కూడా లేదు. కాని, ట్రంపా... హిల్లరీనా ఎవ్వరికీ అంతుపట్టటం లేదు. పోటీ నెక్ టూ నెక్ వుంది. ఈ మధ్యలోనే అటు హిల్లరీని కార్నర్ చేయాలని ట్రంప్ వర్గం, ట్రంప్ ను స్మాష్ చేయాలని మిసెస్ క్లింటన్ వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ మధ్య హిల్లరీ గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. ఇంకా అనేక చిన్నా,చితక సమస్యలు హిల్లరీ ఎదుర్కొంటూనే వుంది. కాని, అసలు పెద్ద సమస్యలన్నీ ట్రంపేకే ఎదురవుతున్నాయి...
ఈ సారి ట్రంప్ ప్రత్యర్థి మహిళ కావటంతో లేడీస్ ఓట్లు కీలకంగా మారాయి. అమెరికన్ ఫీమేల్ ఓటర్స్ అధికంగా క్లింటన్ కే పట్టం కడతారని అంతా భావిస్తున్నారు. అయితే, మహిళల్లో ట్రంప్ ఫాలోయింగ్ మరింత తగ్గించాలని చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఆయన గతంలో ఓ టీవీ షోలో కాస్త లూజ్ టాక్ చేసేశాడు. ఇప్పుడు ఆ వీడియో బయటకొచ్చింది. అందులో డొనాల్డ్ ట్రంప్ ఆడవాళ్ల గురించి డ్యామేజింగ్ గా మాట్లాడాడు. స్త్రీలు సెలబ్రిటీలు ప్రయత్నిస్తే పడిపోతారని, శృంగారానికి సై అంటారనీ అన్నాడు! ఇలా ట్రంప్ ఆడవాళ్ల గురించి మాట్లాడటం హిల్లరీకి బాగా కలిసొస్తోంది. అతడి లాంటి వాడ్ని అమెరికన్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టోద్దని ఓటర్లకు చెబుతోంది!
ట్రంప్ తన ఫ్లాష్ బ్యాక్ నిర్వాకాలకు పశ్ఛాత్తాప పడుతూ ఫేస్బుక్ లో సారీ చెప్పాడు. తాను మహిళల గురించి అలా మాట్లాడటం తప్పేనని లెంపలేసుకున్నాడు. అంతకు మించి ఎన్నికల ముందు అతడికి వేరే ఛాన్స్ కూడా లేదు! కాకపోతే, హిల్లరీ భర్త ఆడవాళ్లను తనకంటే హీనంగా చూస్తాడని ముక్తాయింపు ఇచ్చాడు! బిల్ క్లింటన్ తన వద్ద పని చేసే వైట్ హౌజ్ ఉద్యోగినితో చేసిన రాసక్రీడలు తెలిసినవేగా!


.jpg)



