శంకరమ్మకి ఓడిపోయే చోట సీటు!
posted on Apr 4, 2014 2:40PM

కేసీఆర్ శుక్రవారం ప్రకటించిన తొలి జాబితాలో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్ టిక్కెట్‌ని కేటాయించారు. నిజానికి ఈ స్థానంలో శంకరమ్మ కాదు కదా, సాక్షాత్తూ కేసీఆర్ పోటీ చేసినా టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదట. అలాంటి ఓడిపోయే సీటును శంకరమ్మకి కేటాయించడం దారుణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు కేసీఆర్‌కి శంకరమ్మకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం ఎంతమాత్రం ఇష్టం లేదు. అయితే శంకరమ్మ తనకు సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, ఉద్యమకారుల కుటుంబాలకు టిక్కెట్లు ఇవ్వలేదన్న ఆరోపణలు తప్పించుకోవాలన్న ఆలోచన రావడంతో కేసీఆర్ శంకరమ్మకి హుజూర్ నగర్ టిక్కెట్ కేటాయించారు. దీనికి టీ టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు దుయ్యబడుతున్నారు. గెలవని సీటుని శంకరమ్మకి ఇచ్చి, గెలిచే సీట్లను మాత్రం తన కుటుంబ సభ్యులకు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్‌కి ఉద్యమకారుల కుటుంబాల మీద గౌరవం వుంటే సిద్దిపేట టిక్కెట్ శంకరమ్మకి ఇచ్చి, హుజూర్ నగర్ టిక్కెట్ హరీష్ రావుకి ఇవ్వాలని సవాల్ విసిరారు.