Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎస్ఐపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దౌర్జన్యం
posted on: Dec 29, 2016 4:19PM
.jpg)
చట్టం తన పని తాను చేసుకుపోతుంది..చట్టం కళ్లలోంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.. ఇవి మనదేశంలో రాజకీయ నాయకుల నోళ్లలో నానే మాటలు. కానీ అదంతా పైకి కనిపించే కలరింగ్ మాత్రమే వాస్తవంలో జరిగేది వేరు. నిజానికి చట్టాలైనా..అధికారులైనా అధికారంలో ఉన్న వారి కోసమే పనిచేస్తాయి. కాదంటే చట్టాలే మారిపోతాయి..అంతేతప్ప ఏ అధికారి తనంత తానుగా ఏ నిర్ణయం తీసుకోడు. అక్రమం అని చెప్పబడే ప్రతి విషయం..మన నేతాశ్రీల కోసం సక్రమంగా మారుతుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. ట్రిపుల్ రైడింగ్ చట్టరీత్యా నేరం..చట్టాన్ని ధిక్కరించి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పోలీసుల కంటపడ్డామా( అంటే పోలీసులు ఆ దారిలో లేకపోతే ఓకే) మన సంగతి అవుట్. జేబు గుల్లవ్వాల్సిందే.
అయితే ఇక్కడ రాజకీయ నాయకులకు కొన్ని మినహాయింపులున్నాయి..ట్రిపుల్ రైడింగ్ చేస్తూనో..సీటు బెల్ట్ పెట్టుకోకుండానో..డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూనో ఈ నాయకుల మనుషులు పట్టుబడితే వాళ్లను పోలీసులు వదిలిపెట్టాల్సిందే..అలా కాదని జరిమానా విధించడమో..జైలుకు పంపడమో చేశారనుకోండి. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకు తాజాగా జరిగిన ఘటన ప్రత్యక్ష నిదర్శనం. కామారెడ్డిలో స్థానిక ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ఒకే బైక్‌పై ముగ్గురు వెళ్లడం చూసిన ఎస్ఐ వాళ్లను ఆపారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నందుకు జరిమానా కట్టాలని ఎస్ఐ చెప్పారు. అయితే తాము టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ అనుచరులమని తమని వదిలివేయాలని వార్నింగ్ ఇచ్చారు. అందుకు ససేమిరా అన్న ఎస్ఐతో వారు వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మరీ విషయం చెప్పారు.

అంతే క్షణాల్లో అనుచరులతో స్పాట్‌కు వచ్చిన ఎమ్మెల్యే రవీందర్ కోపంతో ఊగిపోతూ..అసలు ఏమైందో కూడా తెలుసుకోకుండా నానా రచ్చ చేశారు. "నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను..నేనెవరో నీకు తెలియదా..? నా పేరు చెప్పినా నా మనుషులను వదలవా..నీ సంగతి ఏంటో తెలుస్తా" అంటూ ఎస్ఐపై అంతెత్తున లేచారు. పక్కనున్న ఎమ్మెల్యే అనుచరులు ఎస్ఐని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా..దాడికి దిగబోయారు. ఆ వెంటనే ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసి తమ వారిని విడిపించుకుని వెళ్లిపోయారు. జరిగిన సంఘటనను మొదటి నుంచి చివరిదాకా చూసిన జనం ముక్కున వేలేసుకున్నారు.






