నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
posted on: Aug 28, 2014 10:50AM

కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్‌లో వున్న పెద్ద భవనం మీద నుంచి దూకి ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన విద్యార్థిని పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరుకు చెందిన శ్రీకాంత్ ప్రసన్న కుమార్‌గా గుర్తించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదు. అయితే చదువులో వెనుకబడి వున్న కారణంగానే శ్రీకాంత్ ప్రసన్న కుమార్ ఆత్మహత్య చేసుకుని వుంటాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండోసారి. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో నవీన్ అనే విద్యార్థి కూడా భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.


.jpg)
.jpg)


