ఉదయ్ కృష్ణారెడ్డికి పొటెన్సీ టెస్ట్..!

posted on: Aug 17, 2026 7:59PM

 

లైంగిక పటుత్వ పరీక్షకి  కోర్టు గ్రీన్ సిగ్నల్..!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కీలక అంశాలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఉదయకృష్ణా రెడ్డిని మరో రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు ఉప్పరపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఉదయ్ కృష్ణారె డ్డిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పలు అంశాలపై విచారణ జరిపారు. అయితే దర్యాప్తులో ఉదయ్ కృష్ణారెడ్డి నోరు మెదపలేదని, విచారణకు సహకరించలేదని మరోసారి కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు కోర్టును ఆశ్రయించారు. పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

విచారణలో ప్రధానంగా రెండో ఐఫోన్ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించనున్నారు. ఆ ఫోన్ ఎక్కడ ఉంది? దానిని ఎవరు ఉపయో గించారు? అందులో ఏవైనా కీలక సమాచారం, కాల్ డేటా, మెసేజ్‌లు లేదా ఇతర ఆధారాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో ప్రస్తావనకు వచ్చిన సూసైడ్ లెటర్ వ్యవహారాన్ని కూడా పోలీసులు తేల్చే ప్రయత్నం చేయనున్నారు. ఆ లేఖకు సంబంధించిన పూర్తి వివరాలు, దాని నేపథ్యం, లేఖలో పేర్కొన్న అంశాలు తదితర విషయాలపై పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.

కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 18, 19 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించను న్నారు. కోర్టు నిర్దేశించిన సమయానికి అనుగుణం గా విచారణ కొనసాగించాల్సి ఉంటుంది. మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా స్పెర్మ్ టెస్ట్ నిర్వహించేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. 

కేసులో లభించిన ఇతర ఆధారాలతో ఈ పరీక్ష ఫలితాలను కూడా పోలీసులు సరిపోల్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఉదయకృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో ఒకవైపు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి లభించగా, మరోవైపు బెయిల్ పిటిషన్‌పై రేపు కోర్టులో విచారణ జరగనుంది. రెండు రోజుల తాజా కస్టడీలో రెండో ఐఫోన్, సూసైడ్ లెటర్, ఇతర కీలక ఆధారాలపై పోలీసులు మరింత స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. ఈ విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశముంది.

Trainee IPS Udayakrishna Reddy, Upparapally Court, Potency Test, CP Sajjanar, Rajendranagar Court
 

google-ad-img
    Related Sigment News
    • Loading...