Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్‌లో భారీ వర్షం..రెండు కుటుంబాల్లో విషాదం
posted on: Jun 13, 2026 12:35PM
.webp)
హైదరాబాద్‌లో శుక్రవారం (జూన్ 12) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రెండు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. భారీ వర్షం కారణంగా రెండు వేర్వేరు ప్రాంతాలలో జరిగిన రెండు ప్రమాదాలలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు విషాద ఘటనలకు దారితీశాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలు వురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. అల్వాల్ పరిధిలోని టెలికాం కాలనీలో భారీ వర్షం కారణంగా ఓ చెట్టు విరిగి ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నంలో విద్యుత్ తీగలు తగలడంతో తండ్రీ కూతుళ్లు సందీప్, రితిక మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో సందీప్ భార్య శ్వేత గాయపడ్డారు.
మరో ఘటనలో మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో తాటి చెట్టు కూలి ఓ మహిళ మృతి చెందింది. సభావత్ లక్ష్మి తన కుమా రుడు వెంకట్ రామ్, కోడలు లలితతో కలిసి రేకుల ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ఇంటి పక్కనే ఉన్న తాటి చెట్టు కూలి ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.



%20(3).webp)


