హోలీ వేడుకల్లో విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి

posted on: Mar 3, 2026 4:55PM

హోలీ సందర్భంగా సురారంలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకూ ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకున్న ఇద్దరు యువకులు అంతలోనే చెరువులో మునిగి మరణించారు. వివరాలిలా ఉన్నాయి.  స్నేహితులతో కలిసి ఆనందంగా హోలీ వేడుకలలో పాల్గొన్న ఇద్దరు యువకులు అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు సురారంలోని విశ్వకర్మ కాలనీ సమీపంలో ఉన్న పంతులు చెరువులో  దిగి ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు.

మృతులను సాగర్, అభిషేక్ గా గుర్తించారు.  వీరి వయస్సు 17 ఏళ్లు. చెరువు లోతు అంచనా వేయకపోవడం, ఈత రాకపోవడం వల్ల లోతైన ప్రాంతానికి వెళ్లి వీరిరువురూ మునిగిపోయారు. వెంటనే స్థానికులు చెరువులో దిగా వారి కోసం గాలించినా ఫలితం లేకపోయింది.  ఘటనాస్థలానికి చేరుకున్న  పోలీసులు గజఈతగాళ్ల సహాయంలో మూడు గంటల పాటు శ్రమించి ఇరువురి మృతదేహాలనూ చెరువు నుంచి బయటకు తీశారు.  వీరిరువురి మృతితో సురారంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...