Latest News

గృహ ప్రవేశ వేడుకలో విషాదం.. గుండెపోటుతో మహిళ మృతి

posted on: Mar 17, 2026 7:06AM

ఖమ్మంలో ఓ గృహప్రవేశ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. ఆ ఫంక్షన్ కు వెళ్లిన ఓ మహిళ బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతూ హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసింది.     సుస్మిత అనే మహిళ బంధువుల గృహప్రవేశ వేడుకకు వెళ్లింది. ఆ ఫంక్షన్ లో ఫొటోలు దిగుతుండగా  గుండెపోటు రావటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను  ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. అప్పటి వరకూ ఆనందంగా, ఉత్సాహంగా తిరుగుతున్న యువతి ఒక్కసారిగా గుండెపోటుతో కన్నుమూయడం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను విషాదంలో ముంచేసింది.  

హఠాత్ హర్ట్ స్ట్రోక్స్ రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలి కాలంలో ఇలా హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణాలు సంభవిస్తున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో తెలంగాణలో  బహిరంగ వేదికలపై, సామాజిక కార్యక్రమాల్లో గుండెపోటుతో కుప్పకూలిపోయి వ్యక్తులు మరణించిన పలు సంఘటనలు జరిగాయి.   జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం వల్లనే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.  ప్రజలకు ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఇటువంటి మరణాలు ఎత్తి చూపుతున్నాయి.  తరచూ  హెల్త్ టెస్టులు చేయించుకోవడం, లైఫ్ స్టైల్ ను ఆరోగ్యవంతంగా జీవించేలా మార్చుకోవడం, ఆహారపు అలవాట్లను సమీక్షించుకోవడం అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

  గుండెపోటు మరణాల పెరుగుదల ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకతను తెలియచేస్తున్నది  ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేయాలి. వయస్సుతో సంబంధం లేకుండా మూడు పదుల వయస్సు వారు కూడా హార్ట్ స్ట్రోక్ తో మరణించిన సంఘటనలు సంభవిస్తున్నాయి. అందుకే యువత కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

చిన్న వయస్సు కదా.. ఏం భయం లేదు అనుకోవడానికి అవకాశం లేదు.    ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.  ఇక ప్రభుత్వం కూడా ప్రజారోగ్యం విషయంలో చర్యలు తీసుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది.  పాఠశాల స్థాయి నుంచే ఆరోగ్య విద్యను అందించాలి.  గుండెపోటు మరణాలకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించి,  గుండెపోటు మరణాలకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించాలి.  ఆరోగ్య  రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి తగిన నిధులు కేటాయించాలి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...