యూఎస్‌తో ట్రేడ్ డీల్.. భారత్‌పై 10 శాతానికి తగ్గిన టారిఫ్‌లు
posted on: Feb 21, 2026 1:48PM
.webp)
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన టారిఫ్‌లు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో ట్రంప్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దాంతో తీర్పునకు ముందు భారత్ సహా పలు వాణిజ్య భాగస్వామ్య దేశాలతో అమెరికా కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గతంలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలపై 10 శాతం సుంకం అమలవుతుందని వైట్‌హౌస్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.
ఇష్టారీతిన సుంకాలను విధించడం చెల్లదంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన చేశారు. దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఫిబ్రవరి 24 నుంచి 150 రోజుల పాటు ఈ సుంకాలు అమల్లో ఉంటాయి. దాంతో భారత్‌పై టారిఫ్‌లు 18 శాతం నుంచి 10 శాతానికి తగ్గనున్నాయి. అయితే, ఫార్మాతో పాటు ఇతర రంగాలకు సంబంధించిన దిగుమతులపై గతంలో ఇచ్చిన మినహాయింపులు కొనసాగుతాయని వైట్ హౌస్ పేర్కొంది. వాణిజ్య ఒప్పందాల ప్రకారమే సుంకాల విధించే మార్గాల కోసం ట్రంప్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


.webp)



