హిస్టారికల్.. భారత్, అమెరికా ట్రేడ్ డీల్ పై ప్రధాని మోడీ

posted on: Feb 3, 2026 2:29PM

అమెరికా, భారత్‌  మధ్య ఎట్టకేలకు ట్రేడ్‌డీల్ కుదరింది. దీంతో ఇకపై భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు 18 శాతానికి తగ్గాయి. ఈ విషయంలో దక్షిణాసియాలోని పొరుగుదేశాల కంటే భారత దేశం  పైచేయి సాధించినట్లయింది.

బంగ్లాదేశ్‌, శ్రీలంకపై టారిఫ్‌లు 20 శాతం కాగా.. పాకిస్థాన్‌పై 19 శాతం, చైనాపై 34 శాతం వరకూ సుంకాలు ఉన్నాయి. భారత్, అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని ప్రధాని మోడీ చారిత్రాత్మకమని అభివర్ణించారు. తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 3) జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  భారత్, అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ డీల్.. ఈ శతాబ్దపు అతిపెద్ద ఒప్పందంగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయంగా పెరిగిన భారత దేశ ప్రాముఖ్యతను మరింత పెంచుతుందన్నారు.

ట్రేడ్ డీల్ కారణంగా ఇరు దేశాల పరస్పర సుంకాలు ప్రస్తుతం ఉన్న 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయని వెల్లడించారు. ప్రపంచ వ్యవహారాల్లో, సమతుల్యతను కాపాడుకోవడంలో భారత దేశ పాత్ర మరింత పెరుగుతుందని ఎన్డీఏ ఎంపీలతో ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో కొంతమంది తీవ్ర నిరాశకు గురయ్యారని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి మోడీ అపహాస్యం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...