Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారత్ - యూఎస్ డీల్‌తో పాక్‌లో ప్రకంపనలు
posted on: Feb 5, 2026 8:06PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత్ కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ ఇప్పుడు పాకిస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో.. పాక్ అంతర్గతంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి పాక్ పాలకులు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయని.. భారత్ తన ఆర్థిక బలంతో మెరుగైన ఫలితాలను సాధించిందని అక్కడి మేధావులు, రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజలు సైతం భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు.
భారత్-అమెరికా తాజా ఒప్పందం ప్రకారం.. భారతీయ ఎగుమతులపై అమెరికా తన సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. కానీ అంతకు ముందే పాకిస్థాన్ పాలకులు.. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం, 'బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయినప్పటికీ.. అమెరికా పాకిస్థాన్‌కు 19 శాతం సుంకాన్ని ఖరారు చేసింది. భారత్ కంటే ఒక శాతం ఎక్కువ సుంకం విధించడమే కాకుండా, తక్కువ గౌరవం దక్కడం పాక్ ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.






