సీజేఐ సంచలనం.. రాధా హత్యకు రెక్కీ?.. కేసీఆర్ లెక్కేంటీ.. సిద్దూకు షాక్.. టాప్ న్యూస్@7PM

posted on: Dec 26, 2021 5:55PM

అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే ఎన్నెన్నో నిందలు వేస్తున్నారని, శారీరక దాడులకూ దిగుతున్నారంటూ సంచలన కామెంట్లు చేశారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ఆ ఘటనలపై కోర్టులు స్పందించేంత వరకూ ఏ అధికారులూ స్పందించడం లేదని, ఘటనలపై దర్యాప్తు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు సురక్షితమైన వాతావరణం కల్పించినప్పుడే జడ్జిలు నిర్భయంగా పనిచేయగలుగుతారని సీజేఐ జస్టిస్ రమణ అన్నారు.------ఏపీ హైకోర్టుకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు వచ్చారు. ఎన్వీ రమణకు రాజధాని రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. కారుపైన నిలబడి రైతులకు సీజేఐ అభివాదం చేశారు. జస్టిస్‌ ఎన్వీ రమణకు రైతులు పూలతో స్వాగతం పలికారు. అంతకుముందు అమరావతి నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ మరియు రాష్ట్ర బార్ కౌన్సిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు.
---------
వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో వంగవీటి రాధా సంచలన విషయం వెల్లడించారు. తనను చంపేందుకు కొందరు కుట్ర పన్నారని, ఇటీవల రెక్కీ కూడా జరిగిందని అన్నారు. ఇది రాజకీయ వేదిక కాబట్టి ఆ విషయం ఇప్పుడు చెప్పలేనని, వాళ్లెవరో త్వరలోనే తెలుస్తుందని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తులను అందరూ దూరం పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.అయితే తాను ప్రజల మధ్యన ఉండే మనిషనని, దేనికీ భయపడే వ్యక్తిని కానని రాధా ఉద్ఘాటించారు.
----
విశాఖ జిల్లా  పెందుర్తి మండలం నరవలో వైసీపీ నాయకుల దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణానికి వైసీపీ నేత యత్నించారు. దీంతో వైసీపీ నేతలను అడ్డుకున్నారు.  టీడీపీ నాయకులపై వైసీపీ శ్రేణుల దాడికి దిగారు. టీడీపీ నేత గల్లా శ్రీనుపై జెర్రిపోతులపాలెంకు చెందిన వైసీపీ వార్డు మెంబర్ భర్త అప్పారావు రాడ్డుతో దాడి చేశాడు. గల్లా శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు
--------
గుంటూరు జిల్లాలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నడికుడిలో కలర్ జిరాక్స్ ద్వారా నకిలీ నోట్లు తయారుచేస్తున్న గుర్తించారు. రూ.500, రూ.200 నోట్లు ముద్రించి రూ.2.2 లక్షల మేర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చలామణీ చేసినట్టు గుర్తించారు. కాగా ఈ ముఠా సభ్యులు గుంటూరు జిల్లాలోలని దుర్గి, అచ్చంపేట, రెంటచింతల, దాచేపల్లి ప్రాంతాలకు చెందినవారని జిల్లా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు.
-----
ఏపీలో మరో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరికి ఒమైక్రాన్ వేరియంట్ నిర్ధారణ కావడంతో ఏపీలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒంగోలుకు చెందిన 48 ఏళ్ల వ్యక్తితోపాటు యూకె నుంచి అనంతపురంకు వచ్చిన 51 ఏళ్ల వ్యక్తికి ఒమైక్రాన్ నిర్ధారణ అయింది. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల తర్వాత  ఒమైక్రాన్‌గా అధికారులు నిర్ధారించారు
---------
ధాన్యం కొనుగోలు అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోమారు టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. రైతులకు అన్యాయం చేసి ఇంకా గద్దెపై ఉంటారా? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారుగా... మరి సీఎం కేసీఆర్ సొంతపొలంలో పండించిన వరి ధాన్యాన్ని ఏ ఐకేపీ సెంటర్ లో అమ్మారో చెప్పాలి అని రేవంత్ నిలీశారు. మీ భూములు పండితే సరిపోతుందా..? రైతులను రాజును చేస్తామన్న మాటలు ఏమయ్యాయి? అంటూ నిలదీశారు.  
---------
రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం వారు పండించిన ధాన్యం, బియ్యం కేంద్రం కొనుగోలు చేయడం పై రాత పూర్వక హామీ కోసం గత నాలుగు, ఐదు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసిన నేపథ్యంలో తనకు కరోనా వచ్చిందని  పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా కేంద్రం  రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
----------
భారత దేశంపై కన్నెత్తి చూసే సాహసం చేయడానికి ఇతర దేశాలకు అవకాశం లేకుండా అత్యంత సమర్థవంతమైన బ్రహ్మోస్ క్షిపణులను భారత్ తయారు చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అణ్వాయుధాలను తిప్పికొట్టగలిగే సామర్థ్యం మనకు అవసరమని చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణులు, తదితర ఆయుధాలను భారత దేశం తయారు చేస్తోందని, అయితే ఇతర దేశాలపై దాడి చేయాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేయడం లేదని తెలిపారు.
-----
పోలీసుల ప్యాంట్లు తడిసిపోతాయంటూ పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై చండీగఢ్ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు దిల్షేర్ సింగ్ చాందెల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాటలు అదుపులో పెట్టుకోవాలని సిద్ధూని హెచ్చరించారు. పోలీసులే లేకపోతే రిక్షా పుల్లర్ కూడా రాజకీయ నేతల సూచనలు పాటించరని, సిద్ధూ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. సిద్ధూకి వార్నింగ్ ఇస్తున్న డీఎస్పీ చాందెల్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...