Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరో మైలు రాయిని చేరుకున్న తెలుగువన్
posted on: May 29, 2026 2:44PM

తెలుగు డిజిటల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న తెలుగువన్ మరో మైలు రాయిని చేరుకుంది. నిరంతరం విశ్వసనీయమైన వార్తలను అందిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న తెలుగువన్ న్యూస్ (tone news) తాజాగా 1 మిలియన్ సబ్‌స్క్రైబర్ల క్లబ్‌లో చేరింది. టెక్నాలజీ, రాజకీయాలు, వినోదం సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తూ తెలుగువన్ డిజిటల్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
ఈ అద్భుత విజయంపై తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. తమను నిరంతరం ఆదరిస్తూ, నమ్మకమైన ఛానెల్‌గా నిలబెట్టినందుకు కోట్లాది మంది తెలుగు వీక్షకులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. '1 మిలియన్ స్ట్రాంగ్ అనే నినాదంతో ఛానెల్ మున్ముందు మరిన్ని నాణ్యమైన కార్యక్రమాలతో ముందకు సాగుతుందన్నారు. సంచలనాల కోసం కాకుండా, వాస్తవాలను చేరవేయడమే ధ్యేయంగా పెట్టుకోవడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు.

10 లక్షల సబ్‌స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నప్పటికీ.. సబ్‌స్క్రైబర్ల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టిస్తామని చెప్పారు. మిలియన్ సబ్ స్క్రిప్షిన్స్ మైలు రాయిని చేరుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా ఎండీ రవిశంకర్ , తెలుగువన్ న్యూస్, బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


.webp)



