Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ టీఎంసీ నేత.. ఇల్లే బంగారం!
posted on: May 15, 2026 10:23AM

పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నేత ఇల్లంతా బంగారమే. మంచాల దగ్గర నుంచి ఆ ఇంట్లో ప్రతి ఫర్నీచర్ బంగారంతో తయారైందే. శిబ్పూర్ టీఎంసీ నేత షమీమ్ అహ్మద్ అలియాస్ బారే నివాసంలో ఓ కేసు నిమిత్తం సోదాలు నిర్వహించిన పోలీసులకు బంగారంతో తయారు చేసిన ఫర్నీచర్ తో ఆ ఇల్లు మెరిసిపోవడం చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. కాగా సోదాలు జరిగిన సమయంలో షమీమ్ అహ్మద్ కుటుంబం పరారీలో ఉంది.
పశ్చిమ బెంగాల్ ఫలితాలు వెలువడిన అనంతరం శిబ్ పూర్ లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ విజయోత్సవ ర్యాలీపై బాంబులు, తుపాకులతో షమీమ్ అహ్మద్ దాడి జరిపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేసు కూడా నమోదైంది. ఈ కేసులో అరెస్టు భయంతో షమీమ్ అహ్మద్ కుటుంబం పరారీలో ఉంది.
ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన నివాసాంలో సోదాలు నిర్వహించారు. ఆ సోదాలలో ఆయన ఇంట్లో బంగారు మంచం, బంగారు సోఫాతో పాటు.. ఆయన నివాసంలోని మెట్లదారి రహస్య తలుపును తెరిచిన పోలీసులకు కిలోల కొద్దీ బంగారం కనిపించింది.


.webp)
.webp)


