Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం...సూసైడ్ నోట్
posted on: Feb 8, 2026 10:17AM

తిరుపతి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న పద్మ అనే మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. భర్త శివశంకర్ నిరుద్యోగం, అప్పుల భారం కారణంగా కుటుంబంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుండటమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం… పుత్తూరు మండలం నేషనూరుకు చెందిన కన్నెప్పరెడ్డి కుమార్తె పద్మ(28), తొరూరు పంచాయతీకి చెందిన శివశంకర్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో పరిచయమయ్యారు.
కుల భేదం, శివశంకర్ ఉద్యోగం లేకపోవడం వంటి కారణాలతో పద్మ తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. అయినా 2019లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి తేజ(6), లాస్య(5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం పుత్తూరులో నివసిస్తూ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు.భర్త కుటుంబ బాధ్యతలు పట్టించుకోకపోవడం వల్ల పద్మపై ఆర్థిక భారమంతా పడింది. స్వయం సహాయక సంఘం ద్వారా రుణం తీసుకుని పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతోంది. శివశంకర్ మాత్రం ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఇంటికి డబ్బులు ఇవ్వకపోవడంతో పద్మ తీవ్ర మనస్తాపానికి గురైంది.
ఈ క్రమంలో శనివారం భర్త బయటకు వెళ్లిన సమయంలో డ్వాక్రా అప్పు చెల్లించావా అని పద్మ ఫోన్‌లో అడగగా, చెల్లించలేదని చెప్పడంతో ఆమె మరింత కుంగిపోయింది. ఆత్మహత్యకు ముందు రాసినలేఖలో…“తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నా ఇది నా జీవిత గుణపాఠం. లవ్ మ్యారేజ్ చేశానని ఎన్నో కష్టాలు పడ్డాను. అప్పులు తీర్చలేకపోతే నేను ఇంకేం చేయాలి? నేను చనిపోయాక నువ్వు మరో పెళ్లి చేసుకుంటావు అని భర్తను ఉద్దేశించి పేర్కొన్నాది. ఈసారి అయినా లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత చేసుకో” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆపై బెడ్‌రూమ్‌లో తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తాను హాల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శివశంకర్ తలుపులు తీయకపోవడంతో మామ కన్నెప్పరెడ్డికి సమాచారం ఇచ్చాడు. ఆయన వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురూ విగతజీవులుగా వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


.webp)



