తిరుమల లడ్డూ కల్తీపై ఏకసభ్య కమిషన్‌

posted on: Feb 20, 2026 5:22PM

 

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్‌లో రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్‌ను నియమించింది. టీటీడీ పరిపాలన లోపాలు, టెండర్ల సమగ్ర పరిశీలన చేసి 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 

కాగా శ్రీవారి లడ్డూ నెయ్యి ఘటనలో కల్తీపై సీబీఐ నివేదికను ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిషన్‌ను తాజాగా నియమించింది. కోర్టు విచారణలపై ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. కమిటీ నివేదిక సిఫారసుల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...